Advertisementt

మా అధ్యక్షుడిగా మంచు విష్ణు బాధ్యతలు

Wed 13th Oct 2021 12:55 PM
manchu vishnu,maa president,manchu vishnu takes charge as maa president  మా అధ్యక్షుడిగా మంచు విష్ణు బాధ్యతలు
Manchu Vishnu assumes office మా అధ్యక్షుడిగా మంచు విష్ణు బాధ్యతలు
Advertisement
Ads by CJ

మా అధ్యక్షుడిగా ప్రకాష్ రాజ్ మీద భారీ మెజారిటీతో గెలిచిన మంచు విష్ణు ఆ విజయాన్ని ఎంజాయ్ చెయ్యడమే కాదు.. నేడు మా అధ్యక్షుడిగా మా ఆఫీస్ లో బాధ్యతలను చేపట్టాడు మంచు విష్ణు. మా అధ్యక్షుడిగా మంచు విష్ణు ముందు చాలా బాధ్యతలు ఉన్నాయి. ఇప్పటికే మంచు విష్ణు పై పోటీ చేసి ఓడిపోయిన  ప్రకాష్ రాజ్.. తన ప్యానల్ లో గెలిచిన వారు మొత్తం ప్రెస్ మీట్ పెట్టి.. రాజీనామాలు చేసారు. నరేష్ మంచు విష్ణు ప్యానల్ లో ఉన్నప్పుడు మేము విష్ణు తో కలిసి పని చేయలేమంటూ బహిరంగంగానే రాజీనామాలు ప్రకటించారు. ఇక మా అధ్యక్ష పీఠం ఎక్కకుండానే మంచు విష్ణుకి పెను సవాళ్లు ఎదురయ్యాయి.

మంచు విష్ణు మాత్రం ఎవరు రాజీనామా ప్రకటించినా తాను అధ్యక్షుడిగా ఒప్పుకోను అని, వాళ్ళదగ్గరకి వెళ్లి మాట్లాడతాను అని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా తాను అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న ఫొటోస్ ని సోషల్ మీడియాలో చెర్ చేసిన మంచు విష్ణు మీకు ఇచ్చిన హామీలని పూర్తి చేస్తాను.. మీ సహకారం నాకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను అంటూ ట్వీట్ చేసాడు. 

Manchu Vishnu assumes office:

Manchu Vishnu takes charge as MAA President

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ