దర్శకుడు సుకుమార్ డైరెక్షన్ అంటే ఓ స్టయిల్ ఉంటుంది. రామ్ చరణ్ తో సుకుమార్ రంగస్థలం అనే సినిమా చేసారు. యాక్టర్స్ అందరిని డీ గ్లామర్ గా కొత్తగా చూపిస్తూ సినిమాని భారీ బ్లాక్ బస్టర్ చేసారు. ఆ సినిమాలో చిట్టిబాబు గా రామ్ చరణ్ లుక్ కి మంచి రెస్పాన్స్ వస్తే.. హీరోయిన్ రామలక్ష్మి గా సమంత లుక్ కి అంతే ఆదరణ లభించింది. రామ లక్ష్మి గా సమంత లంగా వోణి లో డీ గ్లామర్ గా అదరగొట్టేసింది. సూపర్ పెరఫార్మెన్స్ తో సమంత సైకిల్ కూడా తొక్కింది. గేదెలని కడుగుతూ.. పక్కా పల్లెటూరి పిల్లగా అదరగొట్టింది. ఆ తర్వాత సుకుమార్ నుండి వస్తున్న పుష్ప పాన్ ఇండియా మూవీ లోను పాత్రల లుక్స్ అద్భుతంగా కనిపిస్తున్నాయి.
పుష్ప మూవీలో పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ రామ్ చరణ్ ని డామినేట్ చేసేలా ఉంటే.. ఇప్పడూ హీరోయిన్ రష్మిక సమంత లుక్ తో పోలి ఉంది. సమంత లా రష్మిక కూడా డీ గ్లామర్ గా లంగా వోణి వేసుకుని.. పల్లెటూరి అమ్మాయిలా కనిపించడమే కాదు.. సమంత తో సైకిల్ తొక్కించిన సుకుమార్ ఇక్కడ పుష్ప లో రష్మిక చేత టీవీఎస్ నడిపించాడు. సమంత సైకిల్ మీద పుల్లలు, గడ్డి తీసుకెళితే.. రష్మిక టీవీఎస్ మీద క్యారేజ్ లు అవి పట్టుకెళుతుంది. సమంత లుక్ తో పోలిస్తే రష్మిక లుక్ అంత కొత్తగా ఏం అనిపించదు. అందుకే రామలక్ష్మితో సైకిల్ తొక్కించిన సుకుమార్ శ్రీవల్లితో టీవీఎస్ నడిపించాడన్నమాట.