Advertisementt

శేఖర్ మాస్టర్ ని ఓ ఆటాడుకున్న రోజా

Wed 24th Nov 2021 10:44 AM
etv,dasara special event,etv dasara special event,etv dasara special programm,dasara bullollu promo  శేఖర్ మాస్టర్ ని ఓ ఆటాడుకున్న రోజా
ETV Dasara Special Programme Dasara Bullollu promo goes viral శేఖర్ మాస్టర్ ని ఓ ఆటాడుకున్న రోజా
Advertisement
Ads by CJ

ఢీ డాన్స్ షో కి జేడ్జ్ గా చేస్తున్న శేఖర్ మాస్టర్ ఉన్నట్టుండి.. ఈ టివి లో మాయమై స్టార్ మా లో తేలారు. ఢీ డాన్స్ లో ఎప్పటినుండో జేడ్జ్ గా, జబర్దస్త్ కి స్పెషల్ గెస్ట్ గా.. ఫెస్టివల్స్ కి స్పెషల్ ప్రోగ్రామ్స్ లో సందడి చేసే శేఖర్ మాస్టర్ ఈటివికి దాదాపుగా దూరమయ్యారు. గత ఏడాదిన్నరగా శేఖర్ మాస్టర్ ఈటివి ప్రోగ్రామ్స్ లో కనిపించడం లేదు. స్టార్ మాలో శేఖర్ మాస్టర్ కామెడీ స్టార్స్ కి జేడ్జ్ గాను, ఫెస్టివల్ ప్రోగ్రామ్స్ కి స్పెషల్ గెస్ట్ గా వెళుతున్నారు. అయితే తాజాగా శేఖర్ మాస్టర్ మళ్ళీ ఈటివి లో దసరా ప్రోగ్రాం కి హాజరయ్యారు. ఎప్పటిలాగే స్టేజ్ పై శేఖర్ మాస్టర్ అమ్మాయిలు, యాంకర్స్, హీరోయిన్ సదా తో డాన్స్ చేస్తూ ఫ్లట్ చేసాడు.

అయితే రోజా శేఖర్ మాస్టర్ అలా అమ్మాయిలతో డాన్స్ చెయ్యడం చూసి, సదా తో రొమాంటిక్ గా మూవీ అవ్వడం.. రాను రానంటూనే చిన్నదో.. అని శేఖర్ పాడడం చూసిన రోజా శేఖర్ మాస్టర్ ని బెదిరిస్తూ.. ఆపండి మాస్టర్ అనగానే నేను ఆపను అనగా.. దానికి రోజా రాను రానంటూనే శేఖరో.. ఈవెంట్ కి వచ్చాడు శేఖరూ అంటూ ఆటపట్టించింది. ఈ దసరాకి స్పెషల్ ప్రోగ్రాం లో కె రాఘవేంద్ర రావు.. తన పెళ్లి సందడి టీం తో కలిసి సందడి చేసారు. రోషన్ తో సీరియల్ ఆర్టిస్ట్ లు, యాంకర్స్ అమ్మాయిలు అంతా డాన్స్ చెయ్యగా.. ఆది మాత్రం కామెడి చేసాడు. ఇంకా రామ్ ప్రసాద్.. వీళ్లంతా కామెడీతో దసరా స్పెషల్ ప్రోగ్రాం లో అదరగొట్టేసాడు.ఇక సదా ఫిదా సాంగ్ కి డాన్స్ తో అదరగొట్టేసింది. రేపు విజయదశమి స్పెషల్ గా ఈ ప్రోగ్రాం ఈటీవీలో ఉదయం 9 గంటలకి ప్రసారం కాబోతుంది. 

ETV Dasara Special Programme Dasara Bullollu promo goes viral:

ETV Dasara Special Event