Advertisementt

మహా సముద్రానికి ఫస్ట్ లక్ అదే

Thu 14th Oct 2021 10:59 AM
maha samudram movie,sharwanand,ap cm jagan,100% occupancy,ap theatres  మహా సముద్రానికి ఫస్ట్ లక్ అదే
AP CM Jagan allows 100% occupancy in theatres మహా సముద్రానికి ఫస్ట్ లక్ అదే
Advertisement
Ads by CJ

శర్వానంద్ - సిద్దార్థ్ కలయికలో RX100 ఫేమ్ అజయ్ భూపతి తెరకెక్కించిన మహా సముద్రం నేడు దసరా ఫెస్టివల్ స్పెషల్ గా థియేటర్స్ లో విడుదలయ్యింది. మహా సముద్రం ట్రైలర్, మహా సముద్రం ప్రమోషన్స్ అన్ని సినిమాపై అంచనాలు పెంచేసాయి. గత నాలుగు వారాలుగా.. వారానికో సినిమా హిట్ అవుతున్న తరుణంలో శర్వానంద్ మహా సముద్రం సినిమా కూడా హిట్ అవుతుంది అనే ఫాన్స్ నమ్ముతున్నారు. అయితే మహా సముద్రానికి ఓ పక్క దసరా హాలిడేస్ కలిసి రాగా.. మరోపక్క ఏపీ లో 100 పర్సెంట్ ఆక్యుపెన్సీ కలిసొచ్చింది.

జులై నుండి అనేక సినిమాలు రిలీజ్ అయినా, కరోనా కరోనా అంటూ జగన్ గవర్నమెంట్ ఏపీ థియేటర్స్ లో 50 పర్సెంట్ అక్యుపెన్సీనే కొనసాగించింది. మధ్యలో బడా నిర్మాతలు జగన్ తో మీటింగ్ కోసం ప్రయత్నాలు చేసినా.. మినిస్టర్ పేర్ని నాని తో మీట్ అయ్యి ఇండస్ట్రీ సమస్యలను, 100 పర్సెంట్ అక్యుపెన్సీపై చర్చలు జరపగా.. నిన్న దసరా సందర్భంగా థియేటర్స్ లో 100 శాతం అక్యుపెన్సీకి అనుమతులు ఇస్తూ నిర్ణయం తీసుకోవడంతో.. మహాసముద్రానికి కలిసొచ్చింది. నేడు థియేటర్స్ లో విడుదలైన మహా సముద్రానికి ఏపీ థియేటర్స్ లో 100 శాతం ఆక్యుపెన్సీ అనేది నిజంగా లక్కీనే కదా.. ఇక సినిమాకి హిట్ టాక్ పడితే.. శర్వా అండ్ సిద్దు లకి ఇంకా సూపర్ కదా.. 

AP CM Jagan allows 100% occupancy in theatres :

AP CM Jagan allows 100% occupancy in AP theatres 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ