బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తూ.. నలుగురు అన్నదమ్ముల కథతో తెరకెక్కిన పెద్దన్నయ్య సినిమా బాలకృష్ణ కి ప్లాప్ ఇచ్చింది. పెద్ద అన్నయ్యగా బాలకృష్ణ చిన్న తమ్ముడిగా బాలయ్య నటించిన ఈ సినిమా అన్నదమ్ముల అనురాగం, అపార్ధాలు, అనుబంధం నేపథ్యంలో తెరకెక్కినది. ఆ సినిమాలో రోజా హీరోయిన్ గా నటించింది. పెద్దన్నయ్య గా బాలయ్య లుక్స్, యంగ్ బాలయ్య గా స్టైలిష్ లుక్ అన్నీ ఆకట్టుకున్నా.. ప్రేక్షకులు సినిమాని రిజెక్ట్ చేసారు. ఇప్పుడు అదే టైటిల్ తో రజినీకాంత్ తెలుగులోకి రాబోతున్నాడు. సూపర్ స్టార్ రజినీకాంత్ - శివ కాంబోలో తమిళనాట తెరకెక్కిన అన్నాత్త సినిమాని తెలుగు పెద్దన్నగా రిలీజ్ చెయ్యబోతున్నారు.
దీపావళి సందర్భంగా నవంబర్ 4న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా టీజర్ దసరా స్పెషల్ గా రిలీజ్ చేసారు. ఎప్పటిలాగే రజినీకాంత్ స్టైల్, విలేజ్ బ్యాక్‌డ్రాప్‌తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్, రజినీకాంత్ హీరోయిజాన్ని దర్శకుడు హైలెట్ చేసారు. పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండబోతుంది. అన్నాత్త మూవీ తెలుగు రైట్స్ ని ఏసియన్ సునీల్ దక్కించుకున్నారు. ఈ సినిమా లో నయనతార, మీనా, కీర్తి సురేష్, ఖుష్బూ లు నటిస్తున్నారు. బాలయ్యకి పెద్దన్న టైటిల్ ప్లాప్ ఇచ్చింది మరి రజినీకి అనేది దివాళికి క్లారిటీ వచ్చేస్తుంది.