కొన్నేళ్ల క్రితం శ్రీకాంత్ - రవళి - దీప్తి భట్నాగర్ కాంబోలో కె రాఘవేంద్ర రావు తెరకెక్కించిన పెళ్లి సందడి మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. ఇప్పుడు అదే పెళ్లి సందD ని శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరో గా రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణ లో గౌరీ రోణంకి ఈ సినిమాని తెరకెక్కించారు. అయితే ఈ సినిమా కి మొదటి నుండి గ్లామర్ గా, రొమాంటిక్ గా, ప్రమోషన్స్ పరంగా హైప్ క్రియేట్ చేస్తూ.. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరు, వెంకీలని రప్పించి సినిమాపై అంచనాలు పెంచేశారు. ఆ పెళ్లి సందడికి ఈ పెళ్లి సందD సీక్వెల్ అనేలా.. ఫ్యామిలీ ఫిలిం లా ప్రొజెక్ట్ చేస్తూ.. హైప్ క్రియేట్ చేస్తూ సినిమాని కలర్ ఫుల్ గా ప్రమోట్ చేసారు. రాఘవేంద్ర రావు గారు ఈ సినిమాలో నటించడం మరో విశేషం, రోషన్ అండ్ శ్రీలీల పెయిర్ ఆకట్టుకునేలా ఉండడంతో సినిమాపై అందరిలో ఆసక్తి పెరిగింది.
అయితే దసరా స్పెషల్ గా రిలీజ్ అయిన పెళ్లి సందD మూవీ కి దారుణమైన పూర్ టాక్ వచ్చింది. సినిమాకి ఇచ్చిన బిల్డప్ కి సినిమా కథకి పొంతనే లేదు అంటూ ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. అసలు అప్పటి పెళ్లి సందడికి ఇప్పటి పెళ్లి సందDకి పొంతనే లేదుగా అంటున్నారు.పెళ్లి నేపథ్యంలో సాగే కథ ఇది. అందుకే పెళ్లి సందD అయ్యింది.. అంటూ సినిమా చూసిన వారి ఫీలవుతున్నారు. కథలోనే కాదు, కథనం పరంగా కూడా ఎలాంటి ఇంట్రెస్ట్ కానీ.. కొత్తదనం కానీ కనిపించదు అని.. రాఘవేంద్ర రావు, కీరవాణి మ్యూజిక్, కలర్ ఫుల్ గా చూపించడం తప్ప ఇందులో చెప్పుకోవాల్సిన విషయాలు ఏమీ లేవు అంటున్నారు. అటు రొమాంటిక్ గాను, ఇటు ఎమోషనల్ గాను సినిమా అస్సలు ఆకట్టుకోలేదు అని, హీరో - హీరోయిన్స్ మధ్యన రొమాన్స్ పండలేదు అంటున్నారు.
అందుకే అనేది ఇచ్చిన బిల్డప్ కి.. తీసిన సినిమాకి పొంతనలేదు.. అంటూ సోషల్ మీడియాలో పెళ్లి సందD సినిమాకి నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అవడమే కాదు.. క్రిటిక్స్ కూడా సినిమాకి మరీ పూర్ రేటింగ్స్ ఇవ్వడం చూస్తే సినిమా పరిస్థితి అర్ధమవుతుంది.