Advertisementt

సాయి ధరమ్ కోలుకుంటున్నాడు.. ఇక పెళ్లే

Sun 17th Oct 2021 06:59 PM
sai dharam tej,sai tej recovery,sai tej wedding news  సాయి ధరమ్ కోలుకుంటున్నాడు.. ఇక పెళ్లే
Sai Dharam has recovered, and is getting married సాయి ధరమ్ కోలుకుంటున్నాడు.. ఇక పెళ్లే
Advertisement
Ads by CJ

 

సాయి ధరమ్ తేజ్ రోడ్డు యాక్సిడెంట్ లో గాయాల పాలై ఓ నెల రోజుల పాటు హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుని దసరా రోజు అంటే అదే రోజు సాయి ధరమ్ తేజ్ పుట్టిన రోజున సాయి తేజ్ ఆసుపత్రి నుండి డిశార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళాడు. దానితో మెగా ఫాన్స్ కూల్ అయ్యారు. అయితే సాయి తేజ్ ఓ రెండు నెలల పాటు రెస్ట్ తీసుకోవడానికి అమెరికా వెళ్ళబోతున్నాడనే న్యూస్ ఉంది. అదలా ఉంటే సాయి ధరమ్ తేజ్ కోలుకున్నాడని.. త్వరలోనే పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నాడనే ప్రచారం మొదలయ్యింది. 

అంటే సాయి తేజ్ పుట్టిన రోజునాడు నిహారిక బర్త్ డే విషెస్ చెప్పగా.. అల్లు శిరీష్ కూడా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. ఇదే నువ్వు సింగిల్ గా చేసుకోబోయే లాస్ట్ బర్త్ డే అంటూ విష్ చెయ్యడంతో.. ఇప్పుడు అందరిలో నెక్స్ట్ ఇయర్ సాయి తేజ్ పుట్టినరోజు నాటికి ఓ ఇంటి వాడు కాబోతున్నాడు.. అంటే సాయి ధరమ్ పెళ్లి చేసుకోబోతున్నాడు అని దానర్ధం. సాయి తేజ్ పూర్తిగా కోలుకోగానే.. ఆయన పెళ్లి పీటలు ఎక్కొచ్చని అంటున్నారు. ఇక ప్రస్తుతం షోల్డర్ బోన్ సర్జరీ, ఓకల్ కార్డు సర్జరీ నుండి సాయి తేజ్ కోలుకుంటున్నాడని.. ఓ రెండు నెలల రెస్ట్ తర్వాతే సాయి తేజ్ తన తదుపరి మూవీ షూటింగ్స్ లో పాల్గొనబోతున్నాడని తెలుస్తుంది. 

Sai Dharam has recovered, and is getting married:

Sai Dharam Tej recovery and his wedding news go hand-in-hand

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ