Advertisementt

బాలయ్య పారితోషకమే హాట్ టాపిక్

Sun 17th Oct 2021 07:26 PM
balakrishna,unstoppable talk show,aha talk show,balakrishna remuneration,talking point  బాలయ్య పారితోషకమే హాట్ టాపిక్
Balakrishna getting a fancy sum for Unstoppable బాలయ్య పారితోషకమే హాట్ టాపిక్
Advertisement
Ads by CJ

నందమూరి బాలకృష్ణ అఖండ తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆ తర్వాత గోపీచంద్ మలినేని తో NBK107 అలాగే తర్వాత అనిల్ రావిపూడి తో కమిట్ అయిన బాలకృష్ణ ఇప్పుడు మెగా ఫ్యామిలీ అల్లు అరవింద్ ఆహా ఓటిటి కి పని చెయ్యబోతున్నారు. నందమూరి బాలయ్య మెగా కాంపౌండ్ లోకి అడుగు పెట్టడమే పెద్ద సంచలనం. ఆహా ఓటిటి కోసం బాలకృష్ణ అన్‌స్టాప‌బుల్ టాక్ షో కి హోస్ట్ గా చెయ్యబోతున్నారు. ఈ షో కి మెగాస్టార్ చిరు దగ్గర నుండి యంగ్ హీరోలు టాప్ హీరోలు హాజరయ్యే ఛాన్స్ ఉంది.

అయితే బాలకృష్ణ ఫస్ట్ టైం ఓ టాక్ షో కి హోస్ట్ చెయ్యబోతున్నారు. అందుకే ఈ షో పై భీభత్సమైన క్రేజ్ ఉంది. అందుకే ఈ షో కోసం అల్లు అరవింద్ బాలయ్య కి భారీగానే సమర్పిస్తున్నారట. తొలి సీజ‌న్‌లో 12 ఎపిసోడ్స్ ఉంటాయి. బాల్కకృష్ణ కి ఈ టాక్ షో కోసం అన్ని ఎపిసోడ్స్ కి కలిపి 5కోట్ల రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నార‌ట‌. ఒక్కో ఎపిసోడ్‌కు బాలకృష్ణ కి న‌ల‌బై ల‌క్ష‌లు చొప్ప‌న రెమ్యున‌రేష‌న్ ఇస్తున్నార‌ట‌. మరి ఈ వయసులోనూ బాలయ్య  బాగానే సంపాదిస్తున్నారు. అన్నట్టు ఈ అన్‌స్టాప‌బుల్ ఫస్ట్ ఎపిసోడ్ కి మా అధ్యక్ష ఎన్నికల్లో హల్చల్ చేసిన మంచు ఫ్యామిలీ పాల్గొనబోతుందట. 

Balakrishna getting a fancy sum for Unstoppable:

Balakrishna Unstoppable remuneration becomes the talking point

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ