Advertisementt

పాన్ ఇండియా రేంజ్ లో నాని సినిమా

Mon 18th Oct 2021 11:30 AM
shyam singha roy,nani,nani shyam singha roy movie,sai pallvi,shyam singha roy release date announced  పాన్ ఇండియా రేంజ్ లో నాని సినిమా
Shyam Singha Roy release date announced పాన్ ఇండియా రేంజ్ లో నాని సినిమా
Advertisement
Ads by CJ

హీరో నాని ఈ ఏడాది టక్ జగదీశ్ సినిమాని వినాయక చవితి స్పెషల్ గా అమెజాన్ ప్రైమ్ ఓటిటి నుండి రిలీజ్ చేసాడు.. ఆ సినిమాకి మంచి టాక్ వచ్చినా హిట్ మాత్రం అవ్వలేదు. ఇక నాని నుండి ఈ ఏడాది మరో మూవీ రాబోతుంది. నాని - సాయి పల్లవి - కృతి శెట్టి కలయికలో టాక్సీవాలా డైరెక్టర్ రాహుల్ సంకీర్తయన్ దర్శకత్వంలో  తెరకెక్కిన శ్యామ్ సింగ రాయ్ మూవీ కూడా ఈ ఏడాదే రిలీజ్ కాబోతుంది. కొలకత్తా నేపథ్యంలో తెరకెక్కిన శ్యామ్ సింగరాయ సినిమా ఫస్ట్ లుక్ తోనే ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి మొదలయ్యింది. సాయి పల్లవి కాళీ మాత లుక్, నాని ఓల్డ్ లుక్ అన్ని సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేసాయి. ఈమధ్యనే నాని ఫుల్ లుక్ ని వదిలిన మేకర్స్ ఇప్పుడు శ్యామ్ సింగ రాయ్ రిలీజ్ డేట్ ని ప్రకటించారు.

అది కూడా పాన్ ఇండియా రేంజ్ లో నాని శ్యామ్ సింగ రాయ్ మూవీని  డిసెంబర్ 24 న రిలీజ్ చెయ్యబోతున్నట్టుగా నాని - సాయి పల్లవి లు ఉన్న రొమాంటిక్ పోస్టర్ తో ప్రకటించారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో నాని - సాయి పల్లవి శ్యామ్ సింగ రాయ్ మూవీ డిసెంబర్ 24 న రిలీజ్ కాబోతుంది. హీరో నాని తెలుగు, తమిళ లో క్రేజ్ ఉంది. సాయి పల్లవికి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ మంచి క్రేజ్ ఉంది. సో శ్యామ్ సింగ రాయ్ కి ఆ విధంగా వాళ్ళ క్రేజ్ పనికొస్తుంది. 

Shyam Singha Roy release date announced:

Nani Shyam Singha Roy release date announced

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ