బిగ్ బాస్ 5 ఆరు వారాలు పూర్తి చేసుకుని ఏడో వారంలోకి అడుగుపెట్టింది. ఈసారి బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ సెగ ఎంత ఉందో.. వరెస్ట్ పెరఫార్మెర్ సెగ అంతే ఉంది. వారం వారం ఒకరు ఎలిమినేట్ అవుతుండడం ఎంతగా బాధ పెడుతుందో.. వరెస్ట్ పెరఫార్మెర్ గా జైలు కి వెళ్లడం అలానే ఉంది. ఇక ముగిసిన ఆరు వారాలకు గాను ఐదుగురు కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్ ని వీడారు. సరయు, ఉమాదేవి, లహరి, నటరాజ్ మాస్టర్, తాజాగా శ్వేతా లు ఎలిమినేట్ అవ్వగా.. నాగార్జున బిల్డప్ ఇచ్చి ఎలిమినేట్ అన్న లోబో సీక్రెట్ రూమ్ లోకి వెళ్ళాడు.
ఇక ఈ వారం ఓ నలుగురు తప్ప మిగతావారంతా నామినేషన్స్ లోకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. బిగ్ బాస్ ఓ ఆసక్తికర టాస్క్ ద్వారా ఈ వారం నామినేషన్స్ జరిగాయి.. ఆరువారాలుగా నామినేట్ అవుతున్నా అని రవి అంటే.. నా ఇష్టం అని సన్నీ అన్నాడు. ఇక ప్రియని కాజల్ నామినేట్ చేసింది. సిరి అని మాస్టర్ ని నామినేట్ చేసింది. ఇలా ఒకరికొకరు నామినేట్ చెయ్యగా.. ఒక్కొక్కరు తెగ ఫైర్ అవుతున్నారు. సిరి మానస్ సారి చెప్పినా నామినేట్ చేసింది.. నేను సారి చెప్పినా దానిని తీసుకోలేకపోయాను అంది. ఇక శ్రీరామ్, సన్నీ, జెస్సి లు వెరైటీ డ్రెస్ లతో ఆకట్టుకున్నారు. ఇక ఈ వారం షణ్ముఖ్, సన్నీ, మానస్ నామినేషన్స్ నుండి తప్పించుకున్నారు. కెప్టెన్ అవడం వల్ల విశ్వ నామినేషన్స్‌లో ఉండడు. మిగిలిన వాళ్లంతా నామినేట్ అయ్యారు. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో అనేది ఆసక్తికరంగా మారింది.