Advertisementt

ఆ హీరోయిన్ పై పరువు నష్టం దావా

Tue 19th Oct 2021 07:53 PM
shilpa shetty,raj kundra,sherlyn chopra,rs 50 crore,defamation case  ఆ హీరోయిన్ పై పరువు నష్టం దావా
Shilpa Shetty, Raj Kundra slap Sherlyn Chopra with Rs 50 crore defamation case ఆ హీరోయిన్ పై పరువు నష్టం దావా
Advertisement
Ads by CJ

బాలీవుడ్ లో నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా అస్లీల చిత్రాల కేసులో నెలకు పైగా జైలు శిక్ష అనుభవించి.. బెయిల్ పై విడుదలయ్యాడు. రాజ్ కుంద్రా కేసులో నటి గెహెనా వసిష్ఠ, ఇంకా షెర్లిన్ చోప్రాలు హైలెట్ అయ్యారు. గెహెనా వసిష్ఠ.. రాజ్ కుంద్రా కి ఏ పాపం తెలియదు అంటే.. షెర్లిన్ చోప్రా మాత్రం శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాలు తనని లైంగికంగా వేధించారని, శిల్పా శెట్టి తో పొసగడం లేదు అని.. నన్ను బలవంతంగా వాడుకోవాలని రాజ్ కుంద్రా చూసాడు అంటూ షెర్లిన్ చోప్రా బహిరంగంగా వ్యాఖ్యలు చేసింది. శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాలు తనను బెదిరించారంటూ షెర్లిన్ చోప్రా పోలీస్ కంప్లైంట్ కూడా చేసింది. 

పోలీస్ లకి ఇచ్చిన ఫిర్యాదులో షెర్లిన్ చోప్రా రాజ్ కుంద్రా, శిల్ప తనపై లైంగిక దాడికి కూడా యత్నించారని చెప్పింది. అయితే బెయిల్ పై బయటికి వచ్చిన రాజ్ కుంద్రా, శిల్ప శెట్టి లు ఇప్పుడు షెర్లిన్ చోప్రాపై న్యాయపోరాటానికి దిగడమే కాదు.. తమ పరువు పోయేలా షెర్లిన్ చోప్రా చేసిన వ్యాఖ్యలకు ఫలితంగా షెర్లిన్ చోప్రా పై 50 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. షెర్లిన్ చోప్రా రాజ్ కుంద్రా ఇంకా శిల్పా శెట్టి పై చేసిన ఆరోపణలు అవాస్తవమైనవని.. వారిని కించపరిచి, డబ్బులు డిమాండ్ చేసేందుకే ఆమె ఆరోపణలు చేశారని.. శిల్ప శెట్టి తరుపు న్యాయవాది చెబుతున్నారు.. అందుకే న్యాయపరమైన చర్యలు తీసుకోబోతున్నట్టుగా లాయర్ చెప్పారు. 

Shilpa Shetty, Raj Kundra slap Sherlyn Chopra with Rs 50 crore defamation case:

Shilpa Shetty, Raj Kundra File Rs 50 Crore Defamation Case

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ