Advertisementt

పాపం షారుఖ్ వైఫ్

Tue 19th Oct 2021 09:40 PM
gauri khan,progressively anxious,aryan khan,shahrukh khan  పాపం షారుఖ్ వైఫ్
Gauri Khan Is Becoming Progressively Anxious పాపం షారుఖ్ వైఫ్
Advertisement
Ads by CJ

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో బెయిల్ రాక ఇంకా జైల్లో ఊచలు లెక్కబెడుతున్నాడు. డ్రగ్స్ కేసులో జ్యుడిషియల్ కష్టడీలో ఉన్న ఆర్యన్ ఖాన్ కి ముంబై కోర్టు బెయిల్ ఇవ్వడం లేదు. ఎన్సీబీ ఆర్యన్ ఖాన్ కి బెయిల్ రాకుండా వాదనలు వినిపిస్తుంది. ఇక ఆర్యన్ ఖాన్ ప్రస్తుతం సాధారణ ఖైదీల వలే ముంబైలోని ఆర్థర్ రోడ్ జైల్లో ఉన్నాడు. ఇక పుట్టడమే పెద్ద ఫ్యామిలీ, డబ్బున్న ఫ్యామిలిలో గోల్డెన్ స్పూన్ తో పుట్టిన ఆర్యన్ ఖాన్ జైలు కూడు తినడం అనేది చూడడం కన్నా వినడానికే కష్టం గా ఉంది. పుట్టిన దగ్గర నుండి కింగ్ లా బ్రతికి అమెరికా యూనివర్సిటీల్లో చదివి రిచ్ లైఫ్ గడిపిన ఆర్యన్ కి జైల్లో చుక్కలు కనిపిస్తున్నాయి.

అదలా ఉంటే ఆర్యన్ ఖాన్ తల్లి, షారుఖ్ భార్య గౌరీ ఖాన్ కొడుకు జైలు జీవితం తలచుకుని తల్లడిల్లిపోతుంది అని, ఆర్యన్ ఖాన్ జైలుకి వెళ్ళినప్పటినుండి ఆమె సరిగా తినడం లేదని, నిద్ర కూడా పోవడం లేదని, కొడుకు గురించి గౌరీ ఖాన్ బెంగ పెట్టుకుంది అని, ఎక్కువగా దేవుడి మందిరంలోని గడుపుతున్నట్లుగా తెలుస్తుంది. తమని పలకరించడానికి ఇంటికి ఎవరూ రావొద్దు అంటూ షారుఖ్ బంధువులకి, సన్నిహితులకు చెబుతున్నాడట. మరోపక్క వీలైనంత త్వరగా ఆర్యన్ ను బెయిల్ పై బయటకు తెచ్చేందుకు షారుఖ్ ఆయన లాయర్లు విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఆర్యన్ బెయిల్ పిటిషన్ పై రేపు మరోసారి విచారణ జరగనుంది.

Gauri Khan Is Becoming Progressively Anxious :

Gauri Khan Is Becoming Progressively Anxious about Aryan Khan

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ