Advertisementt

అనన్య పాండే పై విజయ్ దేవరకొండ పొగడ్తలు

Wed 15th Dec 2021 09:39 AM
vijay deverakonda,liger pan india film,liger heroine,ananya panday  అనన్య పాండే పై విజయ్ దేవరకొండ పొగడ్తలు
Vijay Deverakonda on Ananya Panday అనన్య పాండే పై విజయ్ దేవరకొండ పొగడ్తలు
Advertisement
Ads by CJ

బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే విజయ్ దేవరకొండ - పూరి జగన్నాధ్ కాంబోలో తెరకెక్కుతున్న లైగర్ మూవీ ద్వారా టాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వబోతుంది. లేలేత అందాలు, గ్లామర్ గర్ల్ అనన్య పాండే జిమ్ వేర్ లో కనిపించింది అంటే యూత్ కి నిద్రే పట్టదు. ఇక లైగర్ మూవీలో అనన్య పాండే పెరఫార్మెన్స్, ఆమె అందం గురించి లైగర్ హీరో విజయ్ దేవరకొండ ఏమన్నాడంటే.. కెరీర్ మొదలు పెట్టి.. కెరీర్ లో సక్సెస్ అయ్యి మంచి పేరు సంపాదించుకోవడానికి తాము చేస్తున్న పనిలో ఎంతో కష్ట పడతారు. సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ కాంపిటీషన్ ఉంటుంది. అక్కడ సక్సెస్ అయితే మీరు ఇండస్ట్రీలో కొంతకాలం ఉండగలుగుతారు.

అందుకోసమే మీరు మీ పెరఫార్మెన్స్ విషయంలో అద్భుతంగా కనిపించాల్సి ఉంటుంది.. సక్సెస్ లేకపోతె మీకు హెల్ప్ చేసేందుకు ఎవరూ ముందుకు రారు. కాబట్టి ఇండస్ట్రీలో మేము మా కెరీర్ లో రాణించడానికి చాలా కష్ట పడ్డాము. లైగర్ కోసం హీరోయిన్ అనన్య పాండే కూడా చాలా కష్టపడింది. అనన్య అద్భుతంగా నటించింది. అందంగా కనిపించింది. లైగర్ రిలీజ్ అయ్యాక అనన్య ని అందరూ లైక్ చేస్తారు అంటూ విజయ్ దేవరకొండ అనన్య పాండే ని పొగిడేసాడు. ఇక లైగర్ షూటింగ్ ప్రస్తుతం గోవా లో జరుగుతుంది. ఆ షెడ్యూల్ తర్వాత లైగర్ టీం విదేశాలకు వెళ్లబోతుంది. 

Vijay Deverakonda on Ananya Panday :

Vijay Deverakonda on Liger heroine Ananya Panday 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ