మహానటి కీర్తి సురేష్ ఈమధ్యనే తన పుట్టిన రోజుని ఘనంగా జరుపుకుంది. అమ్మడు నటిస్తున్న సినిమాల నుండి కీర్తి సురేష్ లుక్స్ వదిలి మరీ బర్త్ డే విషెస్ తెలియజేసారు ఆయా చిత్రాల మేకర్స్. సర్కారు వారి పాటలో మహేష్ సరసన మోడరన్ గా కనిపించబోతున్న కీర్తి సురేష్ గ్లామర్ లుక్ అందరిని ఆకట్టుకుంది. మహేష్ కూడా కీర్తి సురేష్ కి.. ఆమె అందమైన పిక్ పోస్ట్ చేసి విష్ చేసాడు. ఇక చిరు చెల్లెలిగా భోళా శంకర్ నుండి కీర్తి సురేష్ అందమైన, ట్రెడిషనల్ లుక్ బయటికి వచ్చింది. తర్వాత నాని హీరోగా మొదలు కాబోతున్న దసరా సినిమా నుండి కీర్తి సురేష్ కి స్పెషల్ విషెస్ అందాయి.
తాజాగా కీర్తి సురేష్ వింటేజ్ లుక్ లో ఉన్న కొన్ని ఫొటోస్ ని షేర్ చేసింది. పాతకాలం సారీ లో అందమైన ఫొటోలకి ఫోజులిచ్చింది. ఎల్లో కలర్ ఓల్డ్ సారీ లో కీర్తి సురేష్ ఇచ్చిన స్టైలిష్ ఫోజులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఆ ఫొటోస్ తో పాటుగా కీర్తి సురేష్ Vintage yellove.💛 అంటూ షేర్ చేసింది. ప్రస్తుతం కీర్తి సురేష్ వింటేజ్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.