Advertisementt

పిక్ టాక్: భీమ్లా నాయక్ హీరోస్.. రిలాక్స్ మోడ్

Thu 21st Oct 2021 04:02 PM
pawan kalyan,rana daggubati,bheemla nayak movie,bheemla nayak sets,bheemla nayak heroes relaxation mode  పిక్ టాక్: భీమ్లా నాయక్ హీరోస్.. రిలాక్స్ మోడ్
Bheemla Nayak Heroes in a Relax Mode పిక్ టాక్: భీమ్లా నాయక్ హీరోస్.. రిలాక్స్ మోడ్
Advertisement
Ads by CJ

మలయాళ అయ్యప్పన్ కోషియమ్ మూవీ ని తెలుగులో పవన్ కళ్యాణ్ - రానా కాంబోలో సాగర్ కె చంద్ర భీమ్లా నాయక్ గా రీమేక్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ గా, రానా డ్యానియల్ శేఖర్ గా కనిపించబోతున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని ప్రత్యేకంగా వేసిన సెట్ లో జరుగుతుంది. భీమ్లా నాయక్ గా పవన్ కళ్యాణ్ కట్టిన లుంగీ, వేసే డైలాగ్స్ అన్ని సినిమాకే హైలెట్ అనేలా ఉంటే.. రానా ఈగో ఇంకా హైలెట్ కాబోతుంది. నువ్వా - నేనా అని పోటాపోటీ పడే వీరిద్దరి లుంగీ స్టయిల్ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. సంక్రాంతి టార్గెట్ గా తెరకెక్కునున్న ఈ సినిమానుండి ఇప్పటికే రెండు సాంగ్స్, రెండు టీజర్స్ రిలీజ్ అయ్యాయి.

మొన్న భీమ్లా నాయక్ సెట్ నుండి పవన్ అండ్ నిత్య మీనన్ పిక్ ఒకటి బయటికి రాగా.. ఇప్పుడు తాజాగా భీమ్లా నాయక్ సెట్ నుండి పవన్ కళ్యాణ్, రానా ల పిక్ బయటికి వచ్చింది. అందులో పవన్ కళ్యాణ్ మంచం మీద పడుకుని ఉన్నారు. లుంగీ చొక్కా తో భీమ్లా నాయక్ లుక్ లో రిలాక్స్ అవుతుండగా.. పక్కనే ఉన్న ఎడ్ల బండిపై రానా సేద తీరుతున్నాడు. రానా వైట్ అండ్ వైట్ డ్రెస్ లో కనిపిస్తున్నాడు. ఇక రానా - పవన్ కళ్యాణ్ మధ్యన యాక్షన్ సీన్ చిత్రీకరణ జరుగుతున్నట్టుగా ఉంది.. ఎందుకంటే పవన్ అండ్ రానా లు ఇద్దరూ యాక్షన్ పార్ట్ లో ఎలా కనిపిస్తారో.. ఈ పిక్ లో అలా కనిపిసితున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ - రానా ల రిలాక్స్ మోడ్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

Bheemla Nayak Heroes in a Relax Mode:

Pawan Kalyan and Rana Daggubati are on a relaxation mode

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ