ప్రస్తుతం అనిల్ రావిపూడి ఎఫ్ 3 సినిమాతో ప్రేక్షకులకు మరింత వినోదాన్ని అందించేందుకు రెడీ అవుతున్నారు. ఎఫ్2లో ఉన్నట్టుగానే విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తమ పాత్రలను పోషిస్తున్నారు. ఇక సునీల్ మాత్రం కొత్తగా ఈ ప్రాజెక్ట్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మీద శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తమన్నా, మెహరీన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు మరింత గ్లామర్ డోస్‌ను ఇచ్చేందుకు హీరోయిన్ సోనాల్ చౌహాన్‌ను కాస్టింగ్ లోకి తీసుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌లోనే సోనాల్ చౌహాన్ షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ఈ మేరకు మేకర్స్ సోనాల్ చౌహాన్ పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.
హైద్రాబాద్‌లో గత కొన్ని రోజుల క్రితం ప్రారంభించిన ఈ సుధీర్ఘ షెడ్యూల్‌తో దాదాపు ముఖ్య తారాగణం పాల్గొంటున్నారు.