Advertisementt

తండ్రితో కలిసి ఎన్సీబీ ఆఫీస్ కి

Thu 21st Oct 2021 06:48 PM
ananya panday,ncb office,mumbai drugs case,ananya panday leaves ncb office  తండ్రితో కలిసి ఎన్సీబీ ఆఫీస్ కి
Ananya Panday reaches NCB office తండ్రితో కలిసి ఎన్సీబీ ఆఫీస్ కి
Advertisement
Ads by CJ

షారుఖ్ ఖాన్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్న అనన్య పాండే కూడా డ్రగ్స్ కేసులో చిక్కుల్లో పడింది. షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ ఫోన్ లో అనన్య పాండే ఫోన్ కి డ్రగ్స్ మెసేజ్ పంపినట్లుగా ఆధారాలు దొరకడంతో.. ఈ రోజు ఎన్సీబీ అధికారులు షారుఖ్, అనన్య పాండే ఇళ్లపై దాడులు చేసారు. అనన్య పాండే ఇంట్లో సోదాలు నిర్వహించిన ఎన్సీబీ అధికారులు ఆమెని విచారణకు హాజరవ్వాల్సిందిగా చెప్పడంతో.. ఈ రోజు మద్యాన్నం 2 గంటలకు అనన్య తండ్రి తో కలిసి ఎంసీబీ ఆఫీస్ కి వచ్చింది. అనన్య పాండే ని కొన్ని గంటల పాటు ఎన్సీబీ అధికారులు విచారించారు.

షారుఖ్ కూతురు సుహానా ఖాన్ తో చిన్నప్పటి నుండి ఫ్రెండ్ షిప్ చేసిన అనన్య పాండే కి షారుఖ్ కొడుకు ఆర్యన్ కూడా బాగా సన్నిహితుడు. అనన్య పాండేతో పాటు, ఆర్యన్ ఖాన్ సోదరి సుహానా పేరు కూడా డ్రగ్స్ చాట్‌లో కనిపించిందని అంటున్నారు.. అనన్య పాండే ని అందుకే విచారణకు పిలిచినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అనన్య పాండే తండ్రి తో కలిసి ఎన్సీబీ విచారణ పూర్తి చేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది. మరోపక్క  షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ కు కోర్టు డ్రగ్స్ కేసులో రిమాండ్ పొడిగించింది. ఆర్యన్ కు అక్టోబరు 30 వరకు జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తూ ముంబయికోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

Ananya Panday reaches NCB office:

Ananya Panday Leaves NCB Office

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ