నాగ చైతన్య తో డివోర్స్ అన్నాక సమంత ని నెటిజెన్స్ మాత్రమే కాదు.. కొన్ని యూటుబ్ ఛానల్స్ మానసికంగా క్షోభ పెట్టాయి. సోషల్ మీడియాలో సమంత వలనే చైతు విడాకులు తీసుకున్నాడని, అలాగే యూట్యూబ్ ఛానల్స్ లో నాగ చైతన్య శ్రీరామ చంద్రుడు అని, అతను శాంత స్వభావుడు, అంతా సమంత వలనే అంటూ డిబేట్స్ పెట్టడం, అలాగే నెటిజెన్స్ ట్రోలింగ్ తో సమంత చాలా బాధపడింది. నన్ను ఒంటరిగా వదిలేయండి మొర్రో అన్నా వినలేదు. అయితే తనని మానసికంగా క్షోభ పెట్టిన కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పై సమంత ఏకంగా కోర్టు మెట్లు ఎక్కింది. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పై సమంత పరువు నష్టం దావా వేశారు.
ఈ రోజు సమంత కేసు కూకట్ పల్లి కోర్టులో హియరింగ్ కి వచ్చింది. కోర్టులో కి అందరూ సమానమే. కొందరు ఎక్కువ, ఇంకొందరు తక్కువ అనే భావన కోర్టుకి ఉండదు. సమంత కేసును ప్రొసీజర్ ప్రకారమే విచారిస్తాం. ఆమె సెలెబ్రిటీ అయినంత మాత్రాన కేసు త్వరగా విచారించలేము. యూట్యూబ్ చానళ్లు, డాక్టర్ వెంకట్రావులపై పరువు నష్టం దావా పిటిషన్ ను అత్యవసరంగా విచారించడం కుదరదని కూకట్ పల్లి కోర్టు సమంత తరుపు న్యాయవాదికి చిన్నపాటి షాకిచ్చింది. అయితే సమంత షూటింగ్స్ తో చాలా బిజీగా ఉంటారు కాబట్టి ఆమె కేసును కోర్టు ఎమర్జెన్సీ ప్రాతిపదికన విచారించాలని సమంత తరఫు న్యాయవాది బాలాజీ కోరడంతో ఈ మేరకు జడ్జిలు స్పందించారు. కోర్టు సమయం చివరలో పిటిషన్‌పై విచారిస్తామని న్యాయమూర్తి సమంత తరుపు న్యాయవాదికి స్పష్టం చేసారు.