లైగర్ ని డ్రగ్స్ కష్టాలు వెంటాడుతున్నాయి. విజయ్ దేవరకొండ - పూరి జగన్నాధ్ కాంబోలో పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న లైగర్ మూవీ షూటింగ్ గోవా లో కంప్లీట్ చేసుకుని యుఎస్ షెడ్యూల్ కోసం రెడీ అవుతుంది. అయితే టాలీవుడ్ ని బాలీవుడ్ ని పట్టి కుదిపేస్తున్న డ్రగ్స్ కేసులో లైగర్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, అలాగే నిర్మాత ఛార్మి, తాజాగా హీరోయిన్ అనన్య పాండే లు ఇన్వాల్వ్ కావడమే అభిమానులని కలవరపెడుతుంది. మనీ లాండరింగ్ కేసులో సెప్టెంబర్ లో పూరి జగన్నాధ్ , ఛార్మి లు ఎన్సీబీ ఎదుట విచారణకు హాజరయ్యారు. పూరి ని పది గంటలు, ఛార్మి ని ఎనిమిది గంటల పాటు విచారించారు.. మళ్ళీ ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు హాజరవుతామని అధికారులకి పూరి చెప్పినట్లుగా వార్తలొచ్చాయి.
ఇక తాజాగా లైగర్ హీరోయిన్ అనన్య పాండే ఎన్సీబీ విచారణకు హాజరవడం కలకలం రేపింది. షారుఖ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అనన్య పాండే నేడు ఎన్సీబీ విచారణకు హాజరైంది. ముంబై లో రేవ్ పార్టీలో దొరికిన ఆర్యన్ ఖాన్ ఫోన్ లో అనన్య పాండే తో డ్రగ్స్ చాటింగ్స్ కనిపెట్టిన ఎన్సీబీ అధికారులు అనన్య పాండే ఇంట్లో సోదాలు నిర్వహించడమే కాదు.. అనన్య ని విచారణకు పిలిచారు. ఎన్సీబీ అధికారులు అనన్య పాండే ని దాదాపుగా మూడు గంటల పాటు ప్రశ్నించారు. అయితే పాన్ ఇండియా ప్రాజెక్ట్ లైగర్ మూవీపై ఈ డ్రగ్స్ ఛాయలు పడతాయేమో అని విజయ్ దేవరకొండ అభిమానులు టెంక్షన్ పడుతున్నారు.