Advertisementt

రామ్ చరణ్ RC15 లో ఎలా కనిపిస్తాడంటే..

Fri 22nd Oct 2021 11:40 AM
rc15,rc15 regular shoot,ram charan,kollywood director shankar,thaman music,shankar - ram charan combo,kiara advani,anjali,srikanth  రామ్ చరణ్ RC15 లో ఎలా కనిపిస్తాడంటే..
Ram Charan and Shankar to begin shooting for RC15 రామ్ చరణ్ RC15 లో ఎలా కనిపిస్తాడంటే..
Advertisement
Ads by CJ

రామ్ చరణ్ - శంకర్ కాంబోలో మూడు భాషల్లో దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించబోయే RC15 పూజా కార్యక్రమాలతో ఎప్పుడో మొదలైనా.. ఈ రోజు నుండి రెగ్యులర్ షూట్ కి వెళుతుంది. ఫస్ట్ షెడ్యూల్ పూణే, మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో సాంగ్ షూట్ తో మొదలు పెట్టబోతున్నారని తెలుస్తుంది. కియారా అద్వానీ రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అంజలి, శ్రీకాంత్ లాంటి పేరున్న నటుడు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. అయితే ఈ సినిమా మూడు భాషల్లో తెరకెక్కడంతో.. ఈ సినిమాపై అందరిలో విపరీతమైన క్రేజ్ మొదలైంది. రామ్ చరణ్ డ్యూయెల్ రోల్ లో కనిపించబోతున్నాడని, ఈ సినిమాలో మరో కోలీవుడ్ నటుడు కనిపించబోతున్నాడని.. కాదు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ స్పెషల్ రోల్ చేయబోతున్నాడనే ప్రచరం జోరుగా జరుగుతుంది.

ఆదాల ఉంటే RC15 లో రామ్ చరణ్ చెయ్యబోయే పాత్రపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఇదివరకే రామ్ చరణ్ RC15 లో పోలీస్ ఆఫీసర్ గా నటించబోతున్నాడని.. అది దేవాకట్టా - సాయి తేజ్ కాంబోలో వచ్చిన రిపబ్లిక్ లో సాయి తేజ్ పాత్రలా పవర్ ఫుల్ గా ఉండబోతుంది అంటున్నారు. మరి శంకర్ ఓపెనింగ్ రోజున రిలీజ్ చేసిన పోస్టర్ లో రామ్ చరణ్, కియారా లతో సూటు బూటు వేయించి ఓ ఆఫీసర్ లా చూపించారు. మరి దానికి అనుగుణంగానే రామ్ చరణ్ సిబిఐ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారని అంటున్నారు. మరి ఈ సినిమాలో రామ్ చరణ్ ఎలా కనిపిస్తాడో తెలియాలంటే కొద్దిగా వెయిట్ చెయ్యాల్సిందే. 

Ram Charan and Shankar to begin shooting for RC15:

RC15 Regular Shoot Commencing Today

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ