బిగ్ బాస్ సీజన్ 5 నుండి ఇప్పటివరకు ఆరుగురు కంటెస్టెంట్స్ బయటికి వెళ్లారు. సరయు, ఉమాదేవి, లహరి, నటరాజ్ మాస్టర్, హమీద, లాస్ట్ వీక్ శ్వేతా.. ఎలిమినేట్ అయ్యారు. గత వారం లోబో ఎలిమినేషన్ నుండి తప్పించుకుని సీక్రెట్ రూమ్ లో పడ్డాడు. ఇక ఈ వారం ఎలిమినేషన్స్ లో 10 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో అందరూ బాగా ఆడినా.. జెస్సి సీక్రెట్ టాస్క్ లో ఓడిపోయి కెప్టెన్సీ టాస్క్ నుండి బయటికి వచ్చేసాడు. షణ్ముఖ్ జెస్సి వలన చేతకానివాడిలా మిగిలిపోయాడు. ఎప్పుడూ ఓట్స్ ఎక్కువ పడే షణ్ముఖ్ ఈసారి సిరిని అవాయిడ్ చెయ్యడం వలన ఓట్స్ తగ్గాయి. ఇక లోబో డేంజర్ జోన్ లోకి వెళ్లాల్సిన వాడు కాస్త.. సీక్రెట్ రూమ్ లో ఉండడంతో.. ఈసారి కూడా లోబో తప్పించుకునేలా ఉన్నాడు.
కాజల్ కూడా మానస్, సన్నీ, రవి లతో క్లోజ్ అయ్యి సేఫ్ జోన్ లో ఉంది. అయితే సన్నీ - ప్రియా మధ్యలో జరిగిన గొడవతో ప్రియా కాస్త బ్యాడ్ అయ్యింది. అలాగే ఆని మాస్టర్ కూడా ఓటింగ్ విషయంలో కాస్త వీక్ గానే ఉన్నారని. సన్నీ ఫాన్స్, మానస్ ఫాన్స్ ప్రియని టార్గెట్ చెయ్యడంతో ప్రియా ఓటింగ్ పడిపోయింది అని.. ప్రస్తుతం ఈ వారం బయటికి వెళ్ళేవారిలో ప్రియా అండ్ ఆని మాస్టర్ లే ఉంటారని.. ఫైనల్ గా డేంజర్ జోన్ కి ఈ ఇద్దరే అంటున్నారు. రోజు రోజుకు మారుతున్న ఈక్వేషన్స్ కారణంగా ఈ వారం ఎలిమినేషన్ విషయంలో కాస్త గట్టి పోటీ కనిపిస్తుంది అని.. ఈ రోజు నైట్ తో ముగియబోయే ఓటింగ్స్ లో ఎలాంటి మార్పు లేకపోతె ఈ వారం ప్రియా కానీ, అన్ని మాస్టర్ కానీ వెళ్లడం ఖాయం అంటున్నారు.