బాలకృష్ణ - బోయపాటి కాంబోలో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కుతున్న అఖండ మూవీ రిలీజ్ డేట్ విషయంలో బోయపాటి ఇంకా మేకర్స్ కన్ఫ్యూషన్ లోనే ఉన్నట్టుగా ఉన్నారు. మార్కెట్ లో భీభత్సమైన క్రేజ్ ఉన్న అఖండ మూవీ దసరా అన్నారు, దీపావళికి రిలీజ్ అన్నారు.. దసరా వెళ్ళిపోయింది. దివాళీ వచ్చేస్తుంది. కానీ అఖండ రిలీజ్ డేట్ రాలేదు. ఇక చిరు ఆచార్య వచ్చే ఏడాది ఫిబ్రవరికి వెళ్ళిపోయినట్లుగా బాలయ్య అఖండ కూడా వచ్చే ఏడాది రిలీజ్ అవుతుందేమో అందుకే.. మేకర్స్ కామ్ గా ఉన్నారు. లేదంటే అఖండ ప్రమోషన్స్ అంటూ హడావిడి చేసేవారే అంటున్నారు.
నవంబర్, డిసెంబర్ లలో వారానికి రెండు సినిమాల చొప్పున థియేటర్స్ ని ఆక్యుపై చేసాయి. అఖండ కి దారి లేదు. మరి ఈ రెండు నెలలు వదిలిస్తే.. జనవరి పాన్ ఇండియా మూవీస్ తో ఫుల్ బిజీ. సో అఖండ ని ఎలాగో డిసెంబర్ లోనే రిలీజ్ చేస్తే బావుంటుంది అని నందమూరి ఫాన్స్ అభిప్రాయం. అటు బాలయ్య నుండి కానీ, ఇటు బోయపాటి నుండి అఖండ విషయం బయటికి రానివ్వడం లేదు. మరి ఫాన్స్ మాత్రం సోషల్ మీడియాలో అఖండ డేట్ కోసం హడావిడి చేస్తున్నారు. బాలకృష్ణ సరసన ప్రగ్య జైస్వాల్ నటిస్తున్న ఈ సినిమా నుండి రెండు టీజర్స్, ఫస్ట్ సింగిల్ అభిమానులనే కాదు. అందరిని ఆకట్టుకుంది. మరి అందరూ అఖండ రిలీజ్ డేట్ కోసం వెయిటింగ్.