Advertisementt

హ్యాపీ బర్త్ డే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్

Sat 23rd Oct 2021 12:00 PM
prabhas,pan india star prabhas,pan india hero prabhas,radhe shyam movie,salaar prabhas,prabhas adipurush,project k,spirit prabhas,spirit movie,birth day special prabhas,prabhas birth day special  హ్యాపీ బర్త్ డే  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్
Happy Birthday Pan India Star Prabhas హ్యాపీ బర్త్ డే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్
Advertisement
Ads by CJ

డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి లాంటి సినిమాలతో స్టైలిష్ ప్రభాస్ గా పేరుతెచ్చుకున్న ప్రభాస్ బాహుబలితో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అయ్యారు. బాహుబలితో ప్రపంచాన్నే చుట్టేసిన ప్రభాస్ సాహో అంటూ మరో పాన్ ఇండియా మూవీ చెయ్యడమే కాదు.. తాజాగా రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె, స్పిరిట్ అంటూ వరస పాన్ ఇండియా మూవీస్ తో ఫాన్స్ కి లెక్కలేనంత సంతోషాన్ని పంచేసాడు. వయసు దాటిపోయినా.. పెళ్లి చేసుకొని ప్రభాస్ కెరీర్ లో మాత్రం వరస కమిట్మెంట్స్ పాన్ ఇండియా మార్కెట్ ని కొల్లగొడుతున్నారు. రాధేశ్యామ్ షూటింగ్ పూర్తి చేసుకుని సలార్, ఆదిపురుష్ షూటింగ్స్ కి హాజరవుతున్న ప్రభాస్ బర్త్ డే నేడు.

ప్రభాస్ బర్త్ డే స్పెషల్ గా ఆయన నటిస్తున్న సినిమాల నుండి వచ్చే లుక్స్, టీజర్స్, పోస్టర్స్ తో సోషల్ మీడియా నిండిపోయింది. వారం రోజులుగా ప్రభాస్ ఫాన్స్ సోషల్ మీడియాలో చేసే రచ్చ చూస్తే.. ప్రభాస్ కి ఎంత క్రేజ్ ఉందో అర్ధమవుతుంది. ఇక ప్రభాస్ పుట్టిన రోజు స్పెషల్ గా నేడు రాధేశ్యామ్ టీజర్ తో ఆయనకి పుట్టిన రోజు సుభాకాంక్షలు తెలియజెసింది టీం. అలాగే సలార్ నుండి ప్రభాస్ డైలాగ్ టీజర్ రాబోతుంది అంటున్నారు. మరోపక్క అశ్విని దత్, నాగ్ అశ్విన్ లు ప్రాజెక్ట్ కే నుండి సూపర్ హీరో ప్రభాస్ అంటూ ఆయనకి బర్త్ డే విషెస్ తెలియజేసారు. మరి గత ఐదేళ్లుగా ప్రభాస్ పాన్ ఇండియాని ఊపేస్తున్నాడు. ఇప్పుడు ఆయన చేతిలో ఉన్న సినిమాలు రిలీజ్ అయితే ప్రభాస్ ఇండియా నెంబర్ వన్ హీరో గా మారడం ఖాయం. మరి ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న డార్లింగ్ ప్రభాస్ కి సినీజోష్ టీం తరుపున ఏ వెరీ హ్యాపీ బర్త్ డే

Happy Birthday Pan India Star Prabhas:

Prabhas Birthday Special

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ