బాలీవుడ్ లో మలైకా అరోరా - అర్జున్ కపూర్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో అనేది క్లారిటీ ఇవ్వరు కానీ.. 40 ప్లస్ మలైకా అరోరా, 30 ప్లస్ అర్జున్ కపూర్ లు కలిసి కట్టుగా వెకేషన్స్, అలాగే పార్టీలకి పబ్బులకి హాజరవుతారు. అర్జున్ కపూర్, మలైకా అరోరా లు వెళ్లని ప్రదేశం లేదు.. తిరగని బీచ్ లేదు. గోవా, మాల్దీవ్స్, ఇలా ఏ పర్యాటక ప్రదేశాన్ని వదలదు ఈ జంట. మరి భర్త తో విడిపోయిన దగ్గర నుండి అర్జున్ కపూర్ తో చెట్టాపట్టాలేసుకుని పబ్లిక్ గానే రిలేషన్ ని మెయింటింగ్ చేస్తున్న మలైకా అరోరా పెళ్లి ఊసు మాత్రం ఎత్తదు. ఇలానే బావుంది అన్నట్టుగా ఉంటుంది.
ఇక తాజాగా మలైకా బర్త్ డే సందర్భంగా మలైకా అరోరా.. అర్జున్ కపూర్ ఉన్న ఓ అద్భుతమైన పిక్ తో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసాడు. వాళ్ళ రిలేషన్ ని పబ్లిక్ గానే చూపిస్తున్న మలైకా అరోరా.. అర్జున్ కపూర్ కి ముద్దు పెడుతున్న పిక్ పోస్ట్ చేసింది ఆ పిక్ లో మలైకా చేతిలో డ్రింక్ గ్లాస్ కూడా ఉంది. క్యాండిల్ లైట్ డిన్నర్ లో ఈ జంట బర్త్ డే పార్టీ ని బాగా ఎంజాయ్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఆ పిక్ తో అర్జున్ కపూర్ మలైకాకు బర్త్ డే విష్ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. తమ రిలేషన్ ని ఎక్కడా దాచిపెట్టకుండా పబ్లిక్ గా తిరిగే ఈ జంట పెళ్లి పీటలు ఎప్పుడెక్కుతుందా అని బి టౌన్ ఎదురు చూస్తుంది.