Advertisementt

రజినీకాంత్ పెద్దన్న టీజర్‌

Sat 23rd Oct 2021 05:26 PM
rajinikanth,peddanna teaser,rajinikanth peddanna movie,peddanna movie,venkatesh,venkatesh launches rajinikanth peddanna teaser  రజినీకాంత్ పెద్దన్న టీజర్‌
Rajinikanth Peddanna Teaser release రజినీకాంత్ పెద్దన్న టీజర్‌
Advertisement
Ads by CJ

సూపర్ స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ అన్నాత్తె  తెలుగులో పెద్ద‌న్న పేరుతో రాబోతుంది. అన్నాత్తై సినిమా తెలుగు రైట్స్‌ను టాలీవుడ్‌ డిస్ట్రిబ్యూషన్ రంగంలో అగ్రగామి అయిన ఏషియన్ ఇన్ ఫ్రా ఎస్టేట్స్ ఎల్ఎల్‌పి సంస్థ సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో నారాయణదాస్ నారంగ్, సురేష్ బాబు కలిసి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.  తాజాగా పెద్ద‌న్న టీజ‌ర్‌ను ఈ రోజు (అక్టోబర్ 23) విక్టరీ వెంకటేష్ విడుద‌ల‌చేశారు.

ఈ టీజర్ తెలుగు ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. ఇందులో మాస్ ప్రేక్షకులకు కావాల్సిన అంశాలు పుష్కలంగా ఉన్నాయి. డైలాగ్స్, యాక్షన్స్ సీక్వెన్స్, రజినీ మార్క్ స్టైల్‌తో రాబోతోన్న ‘పెద్దన్న’ టీజర్ సినిమాపై అంచనాల‌ను మ‌రింత‌ పెంచింది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా టీజర్ సైతం అందరినీ ఆకట్టుకుంటోంది. డి ఇమ్మాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందరినీ మెప్పించేలా ఉంది.

శివ దర్శకత్వంలో రాబోతోన్న ఈ చిత్రంలో రజనీకాంత్ సరసన నయనతార నటిస్తోంది. మీనా, కుష్బూ, కీర్తి సురేష్, జగపతి బాబు, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఇమ్మాన్ సంగీతం అందిస్తుండ‌గా వెట్రి సినిమాటోగ్రఫర్‌గా, రూబెన్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.

పెద్ద‌న్న సినిమాను దీపావళి కానుకగా నవంబర్ 4న అత్యధిక‌ థియేటర్స్‌ల‌లో భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు.

Rajinikanth Peddanna Teaser release :

Venkatesh launches Rajinikanth Peddanna Teaser 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ