రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ సినిమాని జనవరి 7 న రిలీజ్ చేయబోతున్నాం అంటూ రిలీజ్ డేట్ ప్రకటించి .. ఇప్పుడు ప్రమోషన్స్ విషయంలో సైలెంట్ గా ఉన్నారంటూ సోషల్ మీడియాలో ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ ఫాన్స్ హంగామా చేస్తున్నారు. అయితే ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ విషయంలో రాజమౌళి పక్కా ప్లానింగ్ లో ఉన్నారని.. షూటింగ్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ ఓ కొలిక్కి రావడంతో రాజమౌళి ఇకపై ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ పై దృష్టి పెట్టనున్నారట. అది కూడా ఈ దివాళీ నుండే మొదలు పెట్టబోతున్నారని.. అప్పట్లో రాజమౌళి బాహుబలి ప్రమోషన్ విషయంలో ఎలాంటి ఫార్ములాను అయితే వాడి సక్సెస్ అయ్యారో.. ఇప్పుడు కూడా అదే తరహాలో ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ ని మొదలు పెట్టబోతున్నారట రాజమౌళి.
దానిలో భాగంగానే దీపావళికి ఆర్.ఆర్.ఆర్ నుండి హీరోలిద్దరూ కలిసి ఉన్న ఓ టీజర్ ని రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారని.. రేపో.. మాపో.. ఈ విషయమై ప్రకటన కూడా రాబోతుంది అని అంటున్నారు. ఇక దివాళికి వదిలే టీజర్ నుండి ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ ని రాజమౌళి ఓ రేంజ్ లో చేపట్టబోతున్నారు. అన్ని భాషల ఇండస్ట్రీ ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యేలా ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ ఉండబోతున్నాయట. ఆర్.ఆర్.ఆర్ కి సంబందించిన పోస్టర్ వదిలినా సోషల్ మీడియాలో అది వైరల్ అవ్వాలని, ఆర్.ఆర్.ఆర్ గురించి ఏ చిన్న విషయం కూడా హైలెట్ అయ్యేలా ఉండాలని దర్శకుడు రాజమౌళి పక్కా ప్లానింగ్ చేస్తున్నారట.