Advertisementt

బిగ్ బాస్ 5: ఈ వీక్ ఎవరు వెళ్లారంటే..

Sat 23rd Oct 2021 10:34 PM
bigg boss 5,bigg boss telugu,priya to be eliminated,bigg boss,nagarjuna,bigg boss leaks  బిగ్ బాస్ 5: ఈ వీక్ ఎవరు వెళ్లారంటే..
Bigg Boss 5: Priya to be eliminated on the 7th week బిగ్ బాస్ 5: ఈ వీక్ ఎవరు వెళ్లారంటే..
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 5 ఏడు వారాలు పూర్తి చేసుకుని.. ఎనిమిదో వారంలోకి అడుగుపెడుతున్నారు కంటెస్టెంట్స్. ఈ ఏడు వారాల్లో ఇప్పటివరకు ఆరుగురు ఎలిమినేట్ అవ్వగా.. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయ్యారో తెలిసిపోయింది. శనివారం ఎపిసోడ్ లో నాగార్జున క్లాస్ ఇస్తూనే కంటెస్టెంట్స్ ని నవ్వించేసారు. సన్నీ కి, ప్రియకి, రవి కి సుతిమెత్తగా క్లాస్ ఇచ్చిన నాగ్.. షణ్ముఖ్ వీడియో చూపించి అందరిని నవ్వించాడు. నాగార్జున.. లోబో ని పవర్ రూమ్ కి పిలిచి తోపు, డూపు అని ఎవరిని అనుకుంటున్నావు, నువ్వు సీక్రెట్ రూమ్ లో ఉండి ఏం చూసావ్ అని అడగగా.. నేను చెప్పేవి ఎవరికీ తెలియవనే భ్రమలో లోబో అన్ని చెపేప్సాడు.

అది ప్రియా, కాజల్, అని మాస్టర్, ప్రియాంక, షణ్ముఖ్, రవి లు డూపులు అని, దానికి గల కారణాలు చెప్పగా.. మిగతా వారు మానస్, సన్నీ, విశ్వ, శ్రీరామ్ , సిరి, జెస్సి వాళ్ళని తోపులు అని చెప్పాడు. ఇక ఈ వారం డేంజర్ జోన్ లో అని మాస్టర్, ప్రియాలు ఉన్నారు. ఓటింగ్ లో ఇద్దరూ ఈక్వల్ గా ఉండగా.. మిస్సిడ్ కాల్ విషయంలో ప్రియకి తక్కువ ఓటింగ్ రావడంతో.. ఈ వారం హౌస్ నుండి ప్రియా ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. ఇక ఇప్పటివరకు ఐదుగురు ఆడవాళ్లు బయటికి వెళ్లారు. అందులో సరయు, ఉమాదేవి, లహరి, హమీద, శ్వేతా, తాజాగా ప్రియాలు ఎలిమినేట్ అవ్వగా.. ఒకే ఒక్క మగాడు నటరాజ్ మాస్టర్ అబ్బాయిల్లో ఎలిమినేట్ అయ్యాడు. ఇక ఈ వారం కూడా ఎప్పటిలాగే ఆదివారం ఎపిసోడ్ కన్నా ముందే ప్రియా ఎలిమినేట్ అయిన విషయం శనివారమే లీక్ అయ్యింది.

ప్రియా ఎలిమినేట్ అవడంతో.. శ్రీరామ్ చంద్ర కన్నీళ్లు పెట్టుకున్నాడని.. హౌస్ మొత్తం ప్రియా కి బైబై చెప్పినట్లుగా తెలుస్తుంది. 

Bigg Boss 5: Priya to be eliminated on the 7th week:

Bigg Boss 5: Priya to be eliminated

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ