ఈ రోజు అంటే అక్టోబర్ 23 న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు. మరి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఒకేసారి ఐదు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో బిజీగా వున్న హీరో.. అలాంటి హీరో పుట్టిన రోజు అంటే హడావిడి ఓ రేంజ్ లో ఉండాలి. కానీ సోషల్ మీడియాలో ప్రభాస్ పుట్టిన రోజు హడావిడి అంతగా కానరాలేదు. గత వారం రోజులుగా ప్రభాస్ పాన్ ఇండియా ఫిలిం రాధేశ్యామ్ టీజర్ హడావిడి ఎలా ఉందొ.. ఈరోజు టీజర్ విడుదలయ్యాక అదే కనిపించింది కానీ.. స్పెషల్ గా ఏం లేదు. ఇక సలార్ నుండి ప్రభాస్ లుక్ ఎక్సపెక్ట్ చేస్తే.. సలార్ టీం సింపుల్ గా టైటిల్ తోనే ప్రభాస్ కి బర్త్ డే విషెస్ చెప్పి చప్పగా తేల్చేసింది. ఇక ఆదిపురుష్ నుండి రాముడిగా ప్రభాస్ ఫస్ట్ లుక్ ప్రభాస్ బర్త్ డే కి ఫిక్స్ అనుకున్నారు ఫాన్స్.
కానీ ఓం రౌత్ కూడా ప్రభాస్ ఫాన్స్ ని మోసం చేసాడు. జస్ట్ ప్రభాస్ కి బర్త్ డే విషెస్ తో సరిపెట్టేసారు తప్ప స్పెషల్ గా లుక్ వదల్లేదు. దానితో ప్రభాస్ ఫాన్స్ బాగా డిస్పాయింట్ అయ్యారు. మరోపక్క నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ నుండి ఓ మెస్సేజ్ ఇచ్చాడు. సూపర్ హీరో ప్రభాస్ అంటూ ఆయనకి బర్త్ డే విషెస్ చెప్పి సరిపెట్టేసేసాడు. ఇక నిన్నగాక మొన్న అనౌన్స్ చేసిన స్పిరిట్ నుండి ఎలాంటి అప్ డేట్ ఇవ్వకపోయినా ఫాన్స్ ఫీల్ అవ్వలేదు కానీ.. సలార్, ఆదిపురుష్ టీమ్స్ చేసిన మోసాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. జస్ట్ రాధేశ్యామ్ హడావిడి, సెలబ్రిటీస్ ప్రభాస్ కి చెప్పిన విషెస్ తప్ప సోషల్ మీడియాలో ప్రభాస్ పుట్టిన రోజు స్పెషల్ గా ఇంకేం కనిపించలేదు.
దానిని చూసిన నెటిజెన్స్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో ఐదు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అయినా ఓకె ఒక్క సినిమా టీజర్ తోనే సరిపెట్టేసారు అంటూ పెదవి విరుస్తున్నారు. అంతేకాదు.. ఇంతేనా ప్రభాస్ హడావిడి అంటున్నారు.