బిగ్ బాస్ సీజన్ 5 మొదలైనప్పటినుండి.. బుల్లితెర ప్రేక్షకులు కి బిగ్ బాస్ పై చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. అవేమిటంటే.. బిగ్ బాస్ సీజన్ 5 ఇన్ని వారాలు గడిచినా.. షో లో మజా లేదు, గ్లామర్ లేదు, ఇంకా ఒక్క రొమాంటిక్ యాంగిల్ లేదు.. ఇంట్రెస్ట్ కలిగించే స్కిట్స్ లేవు, కంటెస్టెంట్స్ అంతా బిగ్ బాస్ ని పిచ్చ పిచ్చగా చదివేసి మరీ హౌస్ లోకి అడుగుపెట్టి బిగ్ బాస్ కే అనుగుణంగా ఆడేస్తున్నారు. నామినేషన్స్ లో ఇంకెక్కడా ఫైర్ కనిపించడం లేదు. ఇక శ్రీరామ్ అయితే హమీద వెళ్ళిపోగానే .. డల్ అయ్యాడు. కంటెస్టెంట్స్ ఎవరూ ఎంటర్టైన్ చెయ్యడం లేదు.
సిరి - షణ్ముఖ్ - జెస్సి గేమ్ ఆడడం లేదు.. ఆ సిరి ఓవరేక్షన్ తట్టుకోలేకపోతున్నాం.. అలాగే బిగ్ బాస్ లీకులు సోషల్ మీడియాని చుట్టేస్తుంటే.. మళ్ళీ ప్రత్యేకంగా టివిలో బిగ్ బాస్ చూసేందుకు ఏం ఉంటుంది. సో లీకులకు అడ్డు కట్ట వెయ్యండి..ఇక నాగార్జున గారు మీరు కాస్త గట్టిగా క్లాస్ పీకండి.. లేదంటే కంటెస్టెంట్స్ తెలివితేటలు చూడలేకపోతున్నాం. యాంకర్ రవి, కాజల్ బిగ్ బాస్ కాచి ఓడిపోసేసారు.. ఇక లోబో అయితే ఇంకా ఎందుకు హౌస్ లో ఉన్నాడో అర్ధం కావడం లేదు. రీసెంట్ గా సీక్రెట్ రూమ్ అన్నారు.. ఆ సీక్రెట్ రూమ్ అస్సలు ఇంట్రెస్టింగ్ గా లేదు. ఇక వైల్డ్ కార్డు ఎంట్రీ అని ప్రచారం జరగడమే కాని.. ఇంతవరకు ఆ వైల్డ్ కార్డు ఎంట్రీ పై క్లారిటీ లేదు.
ఇక హౌస్ లోని లేడీస్ ని మొత్తం వరసగా ఎలిమినేట్ చేస్తున్నారు. ఇప్పటికే ఐదుగురు ఆడవాళ్లు బిగ్ బాస్ ని వదిలేసారు. సరయు, ఉమాదేవి, లహరి, హమీద, శ్వేతా.. తాజాగా ప్రియని ఎలిమినేట్ చేసి పంపేశారు. అలాగే బిగ్ బాస్ టైమింగ్స్ మార్చండి.. మరీ పది గంటల వరకు అంటే.. చూసే మూడు ఉండడం లేదు.. అంటూ బిగ్ బాస్ పై బుల్లితెర ప్రేక్షకులు గుక్కతిప్పుకోకుండా కంప్లైంట్స్ చేస్తున్నారు.