కుర్ర హీరోలతో సినిమాలు చేసి గ్లామర్ షో చేసినా పెద్దగా క్లిక్ అవ్వని ప్రగ్య జైస్వాల్.. బాలకృష్ణ తో అఖండ మూవీ లో నటించింది. బాలయ్య పక్కన ప్రగ్య జైస్వాల్ తేలిపోతుంది.. ఆమె మరీ సన్నగా పీలగా ఉంటుంది బాలయ్య చూస్తే భారీగా ఉంటాడనుకుంటే.. రీసెంట్ గానే రిలీజ్ అయిన అఖండ సింగిల్ లో ప్రగ్య జైస్వాల్ బాలయ్య పక్కన పర్ఫెక్ట్ జోడిగా కనిపించింది. ఆ చీర కట్టు.. ఆ హైట్ అన్ని బాలయ్యకి మ్యాచ్ అయ్యేలా ఉన్నాయి. ఇక ఎప్పుడూ సోషల్ మీడియా కి దగ్గరగా ఉండే ప్రగ్య జైస్వాల్ తన లేటెస్ట్ పిక్స్ తో ఫాన్స్ ని ఊరిస్తూనే ఉంటుంది. గ్లామర్ పిక్స్ కానివ్వండి.. లేదంటే ట్రెడిషనల్ వేర్ ఏదైనా ప్రగ్య జైస్వాల్ ఎక్కడా తగ్గదు.
మంచి ఫిట్ నెస్ ని మెయింటింగ్ చేసే ప్రగ్య జైస్వాల్ కి కాలమే కలిసి రావడం లేదు. అందుకే యంగ్ హీరోల ఛాన్స్ లు తగలడం లేదు. మరి ప్రగ్య జైస్వాల్ కెరీర్ కి అఖండ మూవీ ఎమన్నా హెల్ప్ అవుతుందేమో.. అఖండ రిజల్ట్ తేల్చేస్తుంది. చూద్దాం పాప అదృష్టం ఎలా ఉందో అనేది. ఇక ప్రగ్య జైస్వాల్ తాజాగా సోషల్ మీడియాలో కొన్ని పిక్స్ పోస్ట్ చేసింది. అందమైన ఫొటోస్ లో అందంగా నవ్వుతున్న ప్రగ్య పిక్స్ డీసెంట్ గా ఆకట్టుకునేలా ఉన్నాయి.