రాజమౌళి - రామారావు - రామ్ చరణ్. ఆర్.ఆర్.ఆర్ మూవీ జనవరి 7 న రిలీజ్ కి రెడీ అవుతుంది. రాజమౌళి.. ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ ప్లానింగ్ లో ఉన్నారని.. అది ఈ నెల 29 నుండే మొదలు కాబోతుంది అంటూ సోషల్ మీడియాలో ఫాన్స్ హంగామాతో #RRR హాష్ టాగ్ ట్విట్టర్ లో ట్రెండ్ అవుతుంది.. అక్టోబర్ 29 న ఆర్.ఆర్.ఆర్ టీజర్ అని ఒకళ్ళు అంటే.. ఆ రోజు ఏం అకేషన్ లేదుగా అని ఒకరు అంటే.. అకేషన్ ఎందుకు రా భాయ్.. ఆర్.ఆర్.ఆర్ డే నే ఒక అకేషన్ అంటూ ఫాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.
అయితే అక్టోబర్ 29 న టీజర్ ఉండకపోవచ్చు కానీ.. ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ డీటెయిల్స్ ని రాజమౌళి ప్రకటిస్తారని, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఒకేసారి సిల్వర్ స్క్రీన్ పై కనిపించే అద్భుత దృశ్యం కోసం వెయిటింగ్ రాజమౌళి గారు అంటే, కొమరం భీం, అల్లూరి సీతారామరాజుల టీజర్ అక్టోబర్ 29 న అంటూ ఆర్.ఆర్.ఆర్ హాష్ టాగ్ ట్రెండ్ చేస్తూ నానా హంగామా చేస్తున్నారు ఫాన్స్. మరి దివాళికా.. లేదా అక్టోబర్ 29 న ఆర్.ఆర్.ఆర్ టీజర్ అనేది రాజమౌళి కానీ మేకర్స్ కానీ క్లారిటీ ఇస్తే బావుంటుంది మరి.