Advertisementt

స్పెయిన్ లో సర్కారు వారి పాట ఆట పాట

Tue 26th Oct 2021 10:42 AM
sarkaru vaari paata,mahesh babu,parasuram,namrata,keerthi suresh,prakash raj,sarkaru vaari paata movie,sarkaru vaari paata song shoot  స్పెయిన్ లో సర్కారు వారి పాట ఆట పాట
Namrata snap with Keerthi Suresh from Sarkaru Vaari Paata sets go viral స్పెయిన్ లో సర్కారు వారి పాట ఆట పాట
Advertisement
Ads by CJ

మహేష్ బాబు - పరశురామ్ కాంబోలో తెరకెక్కుతున్న క్రేజీ ఫిలిం సర్కారు వారి పాట టీం ప్రస్తుతం స్పెయిన్ లో ఉంది. అక్కడే లాంగ్ షెడ్యూల్ చిత్రీకరణం జరుపుకుంటుంది. నటి కీర్తి సురేష్.. ఇంకా చిత్రంలోని కీలకమైన నటులంతా స్పెయిన్ లోనే ఉన్నారు. మహేష్ వైఫ్ నమ్రత కూడా స్పెయిన్ లోనే ఉంది. తాజాగా సర్కారు వారి పాట షూటింగ్ లొకేషన్ నుండి నమ్రత శిరోద్కర్ ఓ పిక్ పోస్ట్ చేసింది. ఆ పిక్ లో కీర్తి సురేష్ బ్యాక్ లుక్ లోను, నమ్రత నవ్వుతూ కనిపించింది. అక్కడ సర్కారు వారి పాట సాంగ్ చిత్రీకరణ జరుగుతున్నట్టుగా నమ్రత సర్కారు వారి పాట అప్ డేట్ ని సోషల్ మీడియాలో ఆ పిక్ తో పాటుగా షేర్ చేసింది.

ఇక సంక్రాంతి కి రిలీజ్ కాబోతున్న సర్కారు వారి పాట మూవీ ఆర్.ఆర్.ఆర్ మూవీ కి దారివ్వబోతుంది.. అంటే సంక్రాంతి బరి నుండి మహేష్ తప్పుకోబోతున్నాడనే ప్రచారం జరుగుతుంది. ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ అయిన వారానికే సర్కారు వారి పాట రిలీజ్ అంటే.. కలెక్షన్స్ అనుకున్నంతగా రావని.. మహేష్ అండ్ మేకర్స్ అలోచించి సినిమాని వేసవికి షిఫ్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతుంది. మరి సర్కారు వారి పాట రిలీజ్ సంక్రాంతికా.. వేసవికా అనేది 50 - 50 మాత్రమే చెప్పగలం అన్నట్టుగా ఉంది ప్రస్తుత వ్యవహారం. 

Namrata snap with Keerthi Suresh from Sarkaru Vaari Paata sets go viral:

Sarkaru Vaari Paata: Namrata, Keerthi Suresh all smiles

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ