Advertisementt

అనసూయని అత్తా అనేసిన బాలయ్య

Tue 26th Oct 2021 09:19 PM
roja,jabardasth judge,roja phone call to nandamuri balakrishna,balayya,anchor anasuya  అనసూయని అత్తా అనేసిన బాలయ్య
Balakrishna calls Anasuya - Atta అనసూయని అత్తా అనేసిన బాలయ్య
Advertisement
Ads by CJ

గత గురువారం జబర్దస్త్ ఎపిసోడ్ లో ఓ వింత చోటు చేసుకుంది. అందులో ట్రూత్ అంటూ జబర్దస్త్ జేడ్జ్ రోజా ని బాలకృష్ణ గారికి ఫోన్ చెయ్యాలంటూ అనసూయ ఇంకా టీం లీడర్స్ పట్టుబట్టడంతో.. ఆయన మంచి మూడ్ లో ఉంటే ఓకే లేదంటే.. అంటే అదేం ఉండదు.. అని కమెడియన్స్ అనగా.. నాకేం అవ్వదు.. ఆయన నన్నేం అనరు అంటూనే రోజా బాలకృష్ణ కి ఫోన్ చెయ్యడం.. రోజా చెప్పండి అంటూ బాలయ్య ఫోన్ రిసీవ్ చేసుకోవడం.. అంతా కామెడీ కామెడీ అయ్యింది. మనం ఇద్దరూ మళ్ళీ ఎప్పుడు నటిస్తామని అడుగుతున్నారు.. భైరవద్వీపం 2నా, బొబ్బిలి సింహ 2 నా అంటే.. హాహాహా చేద్దాం కలిసి చేద్దాం అన్నాడు బాలయ్య. ఎక్కడ ఉన్నారు సర్ అని రోజా అంటే మన అఖండ.. అఖండ షూటింగ్ లో ఉన్నాను. అఖండ క్లైమాక్స్ షూట్ లో ఉన్నాను అని చెప్పారు. ఇక మనో గారు మీ కోసం ఓ పాట పాడతారనగానే.. విరిసినది వసంత గానం అని మనో పాడగానే.. నేను కూడా ఈమధ్యన పాడుతున్నాను మనో గారు అంటూ బాలయ్య నవ్వించాడు.

ఇక అనసూయ సర్ బాలకృష్ణ గారు అనగానే.. అనసూయ అత్తా అంటూ అనసూయ ని ఆట పట్టించడం మరింతగా హైలెట్ అయ్యింది. అనసూయ ని రంగస్థలం నుండి అందరూ రంగమ్మత్త అని ఏడిపిస్తుంటే.. బాలయ్య మాత్రం అనసూయ అత్తా అంటూ కామెడీ చేసాడు. ఇక జబర్దస్త్ లో నా పక్కన జేడ్జ్ గా మీరు ఉంటే.. బావుంటుంది అని అంటున్నారని రోజా అనగానే.. వస్తానండి జేడ్జ్ గా వస్తాను ఏక్ పెగ్గులే అంటూ సరదాగా మాట్లాడారు బాలయ్య.. ఇక జబర్దస్త్ లో రాఘవ, అభి బ్రో... మీరు నాకన్నా పెద్దవాళ్ళు అంటూ కమెడియన్స్ ని ఆటపట్టించాడు బాలయ్య. బాలయ్య - రోజా ఫోన్ కాల్ ఎపిసోడ్ మాత్రం బాగా రక్తి కట్టింది. 

Balakrishna calls Anasuya - Atta :

Roja phone call to Nandamuri Balakrishna

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ