Advertisementt

నా పెళ్ళికి నన్ను పిలుస్తారా: మంచు మనోజ్

Tue 26th Oct 2021 09:53 PM
manoj manchu,funny tweet,manoj second marriage,few web sites,second marriage  నా పెళ్ళికి నన్ను పిలుస్తారా: మంచు మనోజ్
Manchu Manoj asks scribes to show him his bride నా పెళ్ళికి నన్ను పిలుస్తారా: మంచు మనోజ్
Advertisement
Ads by CJ

మంచు మనోజ్ ఈ మధ్యన తరచూ వార్తల్లో నిలుస్తున్న వ్యక్తి. మా ఎలక్షన్స్ లో మంచు విష్ణు తో పెద్దగా హడావిడి చేసినట్టుగా కనిపించని మనోజ్.. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని భీమ్లా నాయక్ సెట్స్ లో కలవడం హాట్ టాపిక్ అయ్యింది. ఇక తాజాగా మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడంటూ కొన్ని వెబ్ సైట్స్ లో న్యూస్ ప్రచారం లోకి వచ్చింది. మంచు మనోజ్ ప్రేమించి పెళ్లాడిన ప్రణతి రెడ్డి తో విభేదాలు తలెత్తడంతో.. ఆమెకి డివోర్స్ ఇచ్చి.. సింగిల్ గా ఉంటున్నాడు. ఇక సినిమాలకు భారీ గ్యాప్ ఇచ్చిన మనోజ్ అహం బ్రహ్మాస్మి పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. అయితే గతంలోనూ మనోజ్ రెండో పెళ్లి ముచ్చట సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఇక తాజాగా ఓ తెల్ల పిల్లని మనోజ్ కొంతకాలంగా ప్రేమిస్తున్నాడని, ఒంటరిగా ఉంటున్న కొడుకు మనోజ్ కి మోహన్ బాబు పెళ్లి చెయ్యాలి అని అనుకుంటున్నాడని.. త్వరలోనే తెల్ల పిల్లతో మంచు మనోజ్ పెళ్లి అంటూ కొన్ని వెబ్ సైట్స్ న్యూస్ స్ప్రెడ్ చెయ్యడంతో.. మంచు మనోజ్ ఆ వెబ్ సైట్స్ కి కౌంటర్ గా ఓ ఫన్నీ ట్వీట్ చేసాడు. అదేమిటంటే.. దయచేసి నా రెండో పెళ్ళికి నన్ను కూడా పిలవండి, ఆ పెళ్లి ఎక్కడ జరుగుతుంది, ఆ బుజ్జి పిల్ల, తెల్ల పిల్ల.. మీ ఇష్టం రా.. అంతా మీ ఇష్టం అంటూ please invite me too … where is the wedding and who is that Bujji pilla Thella pilla ? istam ra anthaaa me istam అంటూ ట్వీట్ చేసి బ్రహ్మానందం ఆశ్చర్యంతో చూస్తున్న పిక్ ని పోస్ట్ చేసాడు మనోజ్.

Manchu Manoj asks scribes to show him his bride:

Manoj funny take on his second marriage

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ