Advertisementt

ఏడు వారాలకు ప్రియా ఎంత తీసుకుంది అంటే..

Wed 27th Oct 2021 09:30 AM
bigg boss 5 telugu,bigg boss,priya remuneration,shanmukh,jessy,siri,anchor ravi,vishwa  ఏడు వారాలకు ప్రియా ఎంత తీసుకుంది అంటే..
Priya Remuneration for Bigg Boss Telugu 5 ఏడు వారాలకు ప్రియా ఎంత తీసుకుంది అంటే..
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 5 నాగార్జున హోస్ట్ గా ఇప్పటికి 50 రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పటివరకు వారం వారం నామినేషన్స్ హీట్, అలాగే కెప్టెన్సీ టాస్క్ తప్ప మరేమి ఇంట్రెస్ట్ కలిగించే అంశాలేకాదు.. బిగ్ బాస్ సీజన్ 5 లో ఇంట్రెస్ట్ కలిగించే కంటెస్టెంట్స్ ఒక్కరూ లేరు. ఎవరికి వారే బిగ్ బాస్ గేమ్ ని తెగ ఆడేస్తున్నారు. యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ ఏదో పీకేస్తాడనుకుంటే.. ఒక్క టాస్క్ సరిగ్గా ఆడాడు. సిరి, జెస్సిలని తన వెంట తిప్పుకుంటాడు అంతే. ఇక బిగ్ బాస్ సీజన్ 5 కోసం సెలబ్రిటీస్ ని అప్రోచ్ అయినా ఎవరూ రాకపోయేసరికి బిగ్ బాస్ యాజమాన్యం.. కాస్త పేరున్న వారిని హౌస్ లోకి తీసుకువచ్చింది. అందులో ఒక్కొక్కరి క్రేజ్ ని బట్టి పారితోషకం ఫిక్స్ చేసినట్లుగా చెబుతున్నారు.

తాజాగా సీనియర్ నటి, స్టార్స్ సినిమాల్లో కేరెక్టర్ ఆర్టిస్ట్ అయిన ప్రియా బిగ్ బాస్ హౌస్ లో ఏడు వారాలు ఉంది. ఆమె ఏడు వారాలు హౌస్ లో కొంతమందికి గుడ్ గాను, కొంతమందికి బ్యాడ్ గాను మారిపోయింది. అరుపులు, గొడవలు తో ప్రియా బాగానే ఆకట్టుకుంది. అయితే సినిమాలతో బిజీగా వుండే ప్రియా కి బిగ్ బాస్ యాజమాన్యం రోజుకి 45 వేలు చొప్పున.. వారానికి 3.1లక్షల వరకు, మొత్తంగా 49  రోజులకి గాను.. ప్రియకి 21 లక్షలు రెమ్యునరేషన్ కింద ముట్టినట్లుగా తెలుస్తుంది. మరి 49 రోజులు ఫ్యామిలీ కి దూరంగా ఉన్న ప్రియా కి క్రేజ్ ని బట్టి ఆ పారితోషకం పెద్ద ఫిగరేమి కాదంటున్నారు ఆమె ఫాన్స్. 

Priya Remuneration for Bigg Boss Telugu 5:

Bigg Boss 5 Telugu: Details of Priya remuneration

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ