శర్వానంద్ గత నాలుగు సినిమాల నుండి హిట్ కొట్టలేక చేతులెత్తేశాడు. నిన్నగాక మొన్న దసరా రోజున రిలీజ్ అయిన మహాసముద్రం కూడా శర్వానంద్ ని ఆదుకోలేకపోయింది. ప్లాప్ హీరోయిన్స్ తో జోడి కట్టిన శర్వానంద్ కి ఆ సినిమా ప్లాప్ ఇచ్చింది. మహానుభావుడు సినిమా తర్వాత మళ్ళీ శర్వానంద్ హిట్ కొట్టిన దాఖలాలు లేవు. పడి పడి లేచే మనసు, రణరంగం, జాను, శ్రీకారం రీసెంట్ గా మహాసముద్రం మూవీస్ శర్వా కి వరసబెట్టి షాక్ ఇస్తూనే ఉన్నాయి. మరి ఇప్పుడు శర్వానంద్ ఒకే ఒక జీవితం సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వుంది టీం. ఈ సినిమాపై కూడా అంతగా క్రేజ్ కానీ, ఆసక్తి కానీ కనిపించడం లేదు.
ఇక శర్వానంద్ నుండి రాబోయే ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీపైనే శర్వానంద్ భవిష్యత్తు ఆధారపడి ఉంది. అందులోనూ పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక చేతుల్లో శర్వా కెరీర్ అంటూ ప్రచారం స్టార్ట్ అయ్యింది కూడా. అల్లు అర్జున్ తో పాన్ ఇండియా మూవీ, బాలీవుడ్ మూవీస్ తో విపరీతమైన క్రేజ్ సంపాదించిన రష్మిక నే శర్వానంద్ ని నిలబెట్టాలని, ఆమె వలనే ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీ కి క్రేజ్ అండ్ మార్కెట్ వచ్చి సినిమా కి అందరిలో క్యూరియాసిటీ పెరుగుతుంది అని అంటున్నారు. మరి రష్మిక శర్వా ని ఎలా కాపాడుతుందో చూద్దాం.