బిగ్ బాస్ లో ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో లాక్ డౌన్ విధించింది బిగ్ బాస్. కెప్టెన్సీ టాస్క్ లో పోటీ పడి.. కెప్టెన్సీ టాస్క్ అర్హత సాధించిన వారే హౌస్ లోకి ఎంటర్ అవ్వాలి. మిగతా వాళ్లకు హౌస్ లోకి ఎంటర్ అవడానికి లేదు. ఇప్పటివరకు షన్ను - లోబో లు, రవి - సిరి లు, మానస్ - శ్రీరామ చంద్రలు పోటీ పడగా అందులో షణ్ముఖ్, సిరి, శ్రీరామ చంద్రలు టాస్క్ గెలిచి కెప్టెన్సీ కి అర్హత సాధించి మరీ హౌస్ లోకి అడుగుపెట్టగా.. మిగతా వారంతా హౌస్ బయటనే ఉండిపోయారు. రాత్రంతా చలిలో పడుకుని లేచిన సన్నీ.. ఈ చాపలేందో.. ఈ బయట పడుకోవడం ఏందో.. మీకు మనసు లేదు సర్.. బిగ్ బాస్ మీకు మనసు లేదు అని వేడుకుంటున్నాడు.
ఇక కాజల్ లాస్ట్ రౌండ్ కాదు.. నేను 4th రౌండ్ కే వెళతాను.. అంటూ ఎవరు వస్తారు అంటే.. సన్నీ వస్తాడు.. రెండు కార్ల మీద ఫ్లవర్ బొకే తో ఆడుతున్న కాజల్, సన్నీ లు, కాజల్ ని జన్యున్ గా ఆడు మచ్చా అని సన్నీ అన్నాడు. ఇక తర్వాత షణ్ముఖ్ ని సిరి నేను మాట్లాడడం తప్పా అనగానే తప్పే అని అంటాడు షన్ను.. దానితో సిరి హార్ట్ అవుతుంది. సరే సిరి సారి అని షన్ను అనగానే ఎవడికి కావాలి రా నీ సారి అని అరుస్తుంది. దానితో అన్నం తింటున్న శ్రీరామ్ షాకవుతాడు. ఇక ఈ ప్రోమోలో బిగ్ బాస్ ఒక చివరి అవకాశం ఇస్తున్నాడు అనగానే.. ఓ బాల్ కోసం అందరూ పరిగెడతారు. మరి ఈ బాల్ ఎవరికీ దొరుకుందో ఈ రోజు ఎపిసోడ్ లో తేలుతుంది.