Advertisementt

అందరి చూపు వరుడు వైపే..

Thu 28th Oct 2021 10:35 AM
naga shaurya,ritu varma,varudu kaavalenu movie,lakshmi sowjanya,sitara entertainment,naga shaurya varudu kaavalenu  అందరి చూపు వరుడు వైపే..
Varudu Kaavalenu release on Tomorrow అందరి చూపు వరుడు వైపే..
Advertisement
Ads by CJ

నాగ శౌర్య - రీతూ వర్మ జంటగా నటించిన వరుడు కావలెను సినిమా రేపు వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈమధ్యన వరసగా ప్లాప్స్ అందుకున్న నాగ శౌర్య కి వరుడు కావలెను హిట్ చాలా అవసరం. ఈ సినిమాపై ట్రేడ్ లోనే కాదు.. ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలే ఉన్నాయి. టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్ని ఫామిలీస్ కి కనెక్ట్ అయ్యేలా ఉండడంతో.. ఇప్పుడు అందరి చూపు వరుడు కావలెను పైనే ఉంది. ఎమోషన్స్, లవ్, ఫ్యామిలీ డ్రామా అన్ని సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉన్నాయి. ప్రమోషన్స్ పరంగాను వరుడు కావలెను టీం దూసుకుపోతుంది.

దర్శకురాలు లక్ష్మి సౌజన్య సినిమాని అచ్చతెలుగు ఫ్యామిలీ డ్రామాలా చూపించబోతున్నట్లుగా సినిమా ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. నాగ శౌర్య ఆకాష్ కేరెక్టర్, రీతూ వర్మ భూమి కేరెక్టర్ అన్ని ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్, వరుడు కావలెను సంగీత్ ఈవెంట్ కి టాప్ హీరయిన్ పూజ హెగ్డే హాజరవడం, నాగ శౌర్య ఇంటర్వూస్, రీతూ వర్మ ఇంటర్వూస్, ఇంకా టీం ఇంటర్వూస్ అన్ని సినిమాపై అంచనాలు పెంచేలా ఉన్నాయి. మరి రేపు రిలీజ్ కాబోతున్న వరుడు కావలెను మూవీ కి కాస్త పాజిటివ్ టాక్ పడినా.. కలెక్షన్స్ కొల్లగొట్టేయడం ఖాయమంటున్నారు శౌర్య ఫాన్స్. 

Varudu Kaavalenu release on Tomorrow:

Naga Shaurya Varudu Kaavalenu release on Tomorrow

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ