బిగ్ బాస్ లో ఎనిమిదో వారానికి గాను కెప్టెన్సీ టాస్క్ లో ఫైనల్ గా షణ్ముఖ్, సిరి, సన్నీ, శ్రీరామ్ చంద్ర, ఆని మాస్టర్, మానస్ లు ఉన్నారు. ఈ వారం కెప్టెన్ ఎవరు అవుతారో కానీ.. చిన్న చిన్న టాస్క్ లో పోటీ పడి.. కెప్టెన్సీ టాస్క్ ఫైనల్ కి వచ్చిన వారు వెంటాడు వేటాడు టాస్క్ లో పాల్గొనాలి. ఒక్కొక్కళ్ళు మోస్తున్న ధర్మకోల్ బస్తాల్లో ఉన్న బాల్స్ ని ఖాళీ చెయ్యడానికి ప్రయత్నించాలి అనగానే, అందరూ ధర్మ కోల్ బాల్స్ ఉన్న బస్తాలను వేసుకుని.. పోటీకి దిగారు. ఇక ఆ టాస్క్ లో శ్రీరామ్ సన్నీ ని తోసేసాడు. అక్కడినుండి వారి మధ్యన ఫైట్ స్టార్ట్ అయ్యింది. పోరాడి పోరాడి సన్నీ ఒక్కడే కూర్చోగానే.. శ్రీరామ్ వచ్చి ఫ్రెండ్ ని గెలిపించావా లేదా.. ఒప్పుకో అది అన్నాడు. ఏయ్ ఎటాక్ చెయ్యండి అని సన్నీ అనగానే.. కెప్టెన్ గా నువ్వు చేసే రెస్పాన్స్ బులిటీ ఇదేనా అని శ్రీరామ్ అన్నాడు.
ఏంటి రెస్పాన్స్బులిటీ అని సన్నీ అనగానే.. శ్రీరామ్ వెటకారంగా సన్నీ ఇండిపెండెంట్ ప్లేయర్ అనుకున్నా అనగానే.. రా ఇద్దరం ఆడదాం ఆంటూ సన్నీ సర్రమని లేచాడు. అది ఓడిపోయావ్ అని శ్రీరామ్ అనగానే.. సన్నీ కి పట్టరాని కోపం వచ్చింది. శ్రీరామ్ ఇంకాస్త రెచ్చగొడుతూ గాలిలో ముద్దు పెడుతూ గొంతు అదుపులో పెట్టుకో అని సన్నీకి వార్నింగ్ ఇచ్చాడు. ఇక శ్రీరామ్ ని, సన్నీ ని ఆపడానికి మిగతా కంటెస్టెంట్స్ చాలా కష్టపడ్డారు. అన్ని నేనే ఫైట్ చేస్తా రమ్మనండి అంటూ సన్నీ వీరావేశంతో కెప్టెన్సీ బ్యాండ్ పెట్టుకోవడం చూస్తే వారి మధ్యన బాగానే ఫైట్ అయ్యింది అనుకోవచ్చు. మరి ఈ గోల గొడవ ఈ రోజు ఎపిసోడ్ లో ప్రసారం కాబోతుంది.