షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అక్టోబర్ 3 న అరెస్ట్ అయ్యి బెయిల్ కోసం జైలు కి కోర్టుకి, కోర్టుకి జైలు తిరుగుతూన్నాడు. దాదాపుగా 25 రోజుల తర్వాత ఆర్యన్ కి బెయిల్ వచ్చింది. అయితే నిన్ననే బెయిల్ పై రిలీజ్ అవ్వాల్సిన ఆర్యన్ ఖాన్.. కొన్ని ప్రొసీసర్స్ వలన విడుదల కాలేదు. అయితే ఆర్యన్ ఖాన్ కి బెయిల్ మంజూరు చేస్తూ ఓ ప్రముఖ వ్యక్తి సంతకం, వారి పూచి కత్తు మీదే ఆర్యన్ కి బెయిల్ మంజూరు చేస్తామని కోర్టు చెప్పడంతో.. వెంటనే షారుఖ్ ఫ్రెండ్, ప్రముఖ సెలెబ్రిటీ జుహీ చావ్లా షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ బెయిల్ కి పూర్తి బాధ్యత వహిస్తూ లక్ష రూపాయల బాండ్ పేపర్లపై సంతకం చేసింది.
జుహీ చావ్లా - షారుఖ్ కలసి బోలెడన్ని హిట్ మూవీస్ లో నటించడమే కాదు.. వీరిద్దరూ బిజినెస్ పార్ట్నర్స్ కూడా.. అందుకే జుహీ బెయిల్ పేపర్స్ పై ప్రముఖుల సంతకం కావలనగానే.. ముందుకు వచ్చి ఆ పని పూర్తి చేసింది. ఆ బెయిల్ పేపర్స్ పై సైన్ చెయ్యడానికి జుహీ చావ్లా ముంబై సెషన్స్ కోర్టుకు వెళ్లింది. అయితే ప్రస్తుతం ఆర్యన్ ఖాన్ బెయిల్ పై బయటికి రావడం ఎంతో ముఖ్యమని జుహీ చావ్లా చెప్పింది. ఇక ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ పై సంతకం చేసినందుకు గాను.. ఆర్యన్ ఖాన్ గనక కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తే.. దానికి పూర్తి బాధ్యత జుహీ చావ్లా వహించాల్సి ఉంది. ఈ రోజు అన్ని ప్రొసీజర్స్ పూర్తి చేసుకుని ఆర్యన్ ఖాన్ జైలు నుండి విడుదల కానున్నాడు.