శనివారం వచ్చేసింది.. బిగ్ బాస్ స్టేజ్ పైకి నాగార్జున వచ్చేసాడు. ఈ రోజు రాత్రి ఎపిసోడ్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యిది. అంటే శనివారం నాగార్జున బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి క్లాస్ ఇచ్చే రోజు.. ఎవరు తప్పు చేసినా నాగ్ వాళ్ళకి క్లాస్ ఇవ్వడం కాదు.. చెడా మాడా తిట్టేస్తాడు. ఇక ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో ఫైర్ అయిన మానస్, సన్నీ, కాజల్, అని మాస్టర్ కి నాగ్ చేతిలో తిట్లు పడ్డాయి. నాగార్జున ఫోటో కార్డ్స్ ని మిషన్ లో వేస్తూ ఒక్కొక్కరికి క్లాస్ పీకేసాడు. అని హౌస్ మొత్తం డోంట్ గివ్ అప్ అంటూనే ఉన్నారు.. అయినా గేమ్ ఆడారు అని అని మాస్టర్ ని అన్న నాగార్జున కాజల్ ని ఆ తొండాటలేమిటమ్మా అని అనేశాడు.
ఎలాగైనా గెలుద్దామని అని కాజల్ నవ్వింది. గెలుపు కూడా పద్దతిగా ఉంటేనే.. గెలుపులో ఎంజోయ్మెంట్ తెలుస్తుంది అని క్లాస్ పీకాడు. ఇక మానస్ ఫోటో కార్డు తీసిన నాగ్ నీకు ఈ హౌస్ లో ఎమన్నా అన్యాయం జరుగుతుంది అని అనిపిస్తుందా అని అడిగాడు. అన్యాయం అని కాదు సంచాలక్ డెసిషన్ నాకు నచ్చలేదు అన్నాడు మానస్. సంచలక్ నిర్ణయమే ఫైనల్ అన్నాడు నాగ్. ఇక సన్నీ కి మాత్రం నాగ్ బాగా క్లాస్ ఇచ్చేసాడు. సన్నీ చాలామంది ప్రోవోక్ చేసారు సర్ అనగానే.. ప్రోవోక్ చేస్తే ప్రోవోక్ అయ్యిపోతావా.. అని నాగ్ అనగానే.. దానికి సన్నీ నన్ను రా అంటేనే తట్టుకోలేను.. అలాంటిది, అంటే మీదమీదకి వెళ్ళిపోతావా అని నాగ్ అనగానే.. సర్ నేను కొట్టను సర్ అన్నాడు సన్నీ..
అంటే మీదమీదకి వెళ్ళిపోతావా అంటూ నాగ్ ఫైర్ అయ్యాడు. ఎంతమంది నిన్ను ఆపారో తెలుసా.. ఒక మనిషి ఒకటి పట్టుకుని ఉంటే.. అతని చేతిలో నుండి తన్నడం రైట్ అనుకున్నావా నువ్వు అంటూ సన్నీ కి గట్టిగా క్లాస్ ఇవ్వడమే కాదు.. సన్నీ ఫోటో కార్డు ని చించిపారేసాడు నాగార్జున. ఇది ఈరోజు ప్రోమో హైలైట్స్