కన్నడ పవర్ స్టార్ పునీత రాజ్ కుమార్ మరణం పట్ల కేవలం శాండల్ వుడ్ ఇండస్ట్రీనే కాదు.. టాలీవుడ్ ప్రముఖులు కూడా తమ ఆత్మీయుడిని కోల్పోయినందుకు ఎంతో బాధపడుతున్నారు. పునీత్ రాజ్ కుమార్ తెలుగు స్టార్స్ తో విడదీయలేని అనుబంధం ఉంది. పునీత్ మరణవార్త తెలియగానే అందరూ దిగ్బ్రాంతికి గురవుతూ ట్వీట్స్ చేసారు. ఈ రోజు పునీత్ ఆఖరి చూపుల కోసం టాలీవుడ్ ప్రముఖులు చాలామంది బెంగుళూర్ వెళుతున్నారు. ఇప్పటికే బాలకృష్ణ మరికొంతమంది బెంగుళూర్ వెళ్లి పునీత్ భౌతికకాయం వద్ద నివాళులర్పించి పునీత్ అన్న శివరాజ్ కుమార్ ని ఓదార్చారు. బాలకృష్ణ అయితే పునీత్ మృతదేహం వద్ద కన్నీళ్లు పెట్టుకున్నారు.
పునీత్ రాజ్ కుమార్ మరణం తనకి వ్యక్తిగత లోటు అని, పునీత్ ఎన్నో సేవ కార్యక్రమాలు చేసారని, పునీత్ ఇంత చిన్న వయసులో మరణించి అందరికి తీరని ఆవేదన మిగిల్చారని, కన్నడ పరిశ్రమకి పునీత్ మరణం తీరని లోటు. పునీత్ రాజ్ కుమార్ అందరి గుండెల్లో ఉంటారు, పునీత్ రాజ్ కుమార్ మరణం తనని కలిచివేసింది అని చెప్పారు. ఇక బాలయ్య, ప్రభుదేవా పునీత్ భౌతికకాయం దగ్గర నివాళు అర్పించగా.. చిరు, ఎన్టీఆర్, ఇంకా మరికొంతమంది టాలీవుడ్ ప్రముఖులు బెంగుళూరుకి పయనమయ్యారు.