సూపర్ స్టార్ రజినీకాంత్ గురువారం రాత్రి ఉన్నట్టుండి చెన్నై లోని కావేరి ఆసుపత్రిలో జాయిన్ అవడంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఢిల్లీ లో రెండు రోజుల ముందు హుషారుగా ఉన్న రజిని, బుధవారం రాత్రి ఆయన నటించిన అన్నాత్తే మూవీని ఫ్యామిలీతో వీక్షించిన రజిని.. గురువారం హాస్పిటల్ లో జాయిన్ అయ్యారనగానే ఫాన్స్ కంగారు పడ్డారు. అయితే సూపర్ స్టార్ భార్య లతా రజినీకాంత్.. రజినీకాంత్ రెగ్యులర్ హెల్త్ చెకప్ దృష్యా కావేరి హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు తప్ప.. ఆయనకేం హెల్త్ ఇష్యుస్ లేవని, అభిమానులెవరూ కంగారు పడవద్దని చెప్పారు.
అయితే శుక్రవారం డిశ్ఛార్జ్ అవుతారన్న రజినీకాంత్ శనివారం కూడా కావేరి హాస్పిటల్ లోనే పలు టెస్ట్ లు చేయించుకున్నారు. అయితే రజినీకాంత్ కి అన్ని టెస్ట్ లు పూర్తయిన తర్వాత ఆదివారం రాత్రి ఆయన చెన్నై కావేరి ఆసుపత్రి నుండి పూర్తి ఆరోగ్యంతో ఇంటికి చేరుకోవడంతో.. రజిని ఫాన్స్ కూల్ అయ్యారు. రజిని Returned home అంటూ ట్వీట్ చెయ్యడంతో అభిమానులు శాంతించారు. సూపర్ స్టార్ రజినీకాంత్ ఆరోగ్యపరంగా ప్రతి ఏడు చేయించుకునే రెగ్యులర్ హెల్త్ చెకప్స్ కోసమే ఆయన కావేరి ఆసుపత్రిలో జాయిన్ అయ్యారని డాక్టర్స్ చెబుతున్నారు... కానీ ఆయనకేదో సర్జరీ జరిగినట్లుగా చెన్నై మీడియా టాక్.