Advertisementt

ఆహా బాలయ్య లైన్ అప్ మాములుగా లేదుగా

Mon 01st Nov 2021 10:19 AM
balakrishna,unstoppable talk show,mohan babu,vishnu,daughter lakshmi,young rebel star prabhas,young tiger ntr  ఆహా బాలయ్య లైన్ అప్ మాములుగా లేదుగా
Balakrishna guests in Unstoppable leaves all awestruck ఆహా బాలయ్య లైన్ అప్ మాములుగా లేదుగా
Advertisement
Ads by CJ

బాలకృష్ణ ఆహా టాక్ షో అన్ స్టాపబుల్ ప్రోమో తోనే అందరిలో విపరీరతమైన అంచనాలు పెంచేశారు. అల్లు అరవింద్ ఆహ ఓటిటి కోసం బాలయ్య చేసే అన్ స్టాపబుల్ టాక్ షో కి ఫస్ట్ గెస్ట్ గా మంచు ఫ్యామిలీ హాజరైంది. దివాళి స్పెషల్ గా ఫస్ట్ ఎపిసోడ్ రాబోతుంది.. ఆ ఎపిసోడ్ ప్రమోషన్స్ లో భాగంగా మంచు ఫ్యామిలీ ని బాలయ్య చేసిన ఇంటర్వ్యూ ప్రోమో వదిలారు. ఒక్క ప్రమో తోనే ఆ ఫస్ట్ ఎపిసోడ్ పై భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటివరకు బాలయ్య టాక్ షో పై సాధారణ ప్రేక్షకులకు ఉన్న అనుమానాలు కూడా సింగిల్ ప్రోమోతోనే పటాపంచలు చేసేసారు. మోహన్ బాబు తో బాలయ్య ఓ ఆట ఆడుకున్నారు. మా ఎన్నికల్లో సెన్సేషనల్ విజయాన్ని మూటగట్టుకున్న మోహన్ బాబు తో ఫస్ట్ ఎపిసోడ్ ప్లాన్ చేసి ఆహా వారు అందరిలో ఆసక్తిని పెంచేశారు.

ఇక బాలకృష్ణ ఆహా టాక్ షో లో మంచు ఫ్యామిలీ తర్వాత సెకండ్ ఎపిసోడ్ కి తీసుకురాబోయే గెస్ట్ హీరో ఎవరంటే.. దగ్గుబాటి రానా. రానాతో బాలయ్య ఎలా మాట్లాడతారో అనే క్యూరియాసిటీ రానా ఫాన్స్ లో పెరిగిపోతుంది. రానా తర్వాత ఎపిసోడ్ కి హీరో నాని ని గెస్ట్ గా పిలవబోతున్నారని, ఆ తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో బాలయ్య అన్ స్టాపబుల్ గేమ్ షో ఆడబోతున్నారట. మరి ప్రభాస్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో బాలయ్య ఆట, పాట ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇదంతా చూస్తుంటే.. ఆహా బాలయ్య లైనప్ మాములుగా లేదనిపించడం లేదూ.. మరి గెస్ట్ లుగా రాబోతున్న హీరోల సీక్రెట్స్ బాలయ్య ఏమేం బయటపెడతారో చూడాలి. ఎందుకంటే మంచు మోహన్ బాబు ని బాలయ్య దడదడలాడించేసారాయే..

Balakrishna guests in Unstoppable leaves all awestruck:

Balakrishna Unstoppable lineup offers an explosive blast

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ