Advertisementt

రిపబ్లిక్ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

Tue 02nd Nov 2021 10:57 AM
sai tej,republic movie,republic digital streaming date,deva kattaa,sai dharam tej,sai tej republic  రిపబ్లిక్ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
Republic Digital Streaming Date Fix రిపబ్లిక్ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
Advertisement
Ads by CJ

సాయి ధరమ్ తేజ్ - దేవా కట్ట కాంబోలో తెరకెక్కిన పొలిటికల్ థ్రిల్లర్ రిపబ్లిక్ మూవీ అక్టోబర్ 1 న థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. రిపబ్లిక్ సినిమా విడుదలైన ఫస్ట్ షో కే సినిమా కి పాజిటివ్ టాక్ పడింది. సినిమా చాలాబావుంది అంటూ సోషల్ మీడియాలో టాక్ స్ప్రెడ్ అయ్యింది. అయితే రిపబ్లిక్ సినిమా సూపర్ డూపర్ అన్నా.. సినిమా కి కలెక్షన్స్ రాలేదు. 12.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన రిపబ్లిక్ సినిమాకి 5.64 కోట్లతో టోటల్‌గా థియేటర్ రన్ పూర్తి చేసుకుని.. బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్‌గా నిలిచింది.

సాయి తేజ్ సరసన ఐశ్వర్యా రాజేష్, అలాగే పవర్ ఫుల్ పొలిటిషన్ గా రమ్యకృష్ణ నటించిన ఈ సినిమాని ఎంతోమంది రాజకీయనాయకులు మెచ్చి స్పెషల్ స్క్రీనింగ్ కూడా వేయించుకున్నారు. అలాగే సాయి తేజ్ కి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ బెడ్ మీద ఉన్నా ప్రేక్షకులు సింపతీ చూపించలేదు.. దానితో సినిమా ప్లాప్ అయ్యింది. ఇక ఇప్పుడు రిపబ్లిక్ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయ్యినట్లుగా తెలుస్తుంది. ఈ సినిమా ZEE5 లో నవంబర్ 26 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్టు సమాచారం. త్వరలో మేకర్స్ దీనిపై అఫీషియల్ ప్రకటన ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. 

Republic Digital Streaming Date Fix:

Sai Tej Republic Digital Streaming Date Fix

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ