Advertisementt

టీఆర్ఎస్ నుండి బయటికి వచ్చి గెలిచిన ఈటెల

Tue 02nd Nov 2021 07:10 PM
etela rajender,huge victory,huzurabad by polls,kcr,trs,ktr,huzurabad elections  టీఆర్ఎస్ నుండి బయటికి వచ్చి గెలిచిన ఈటెల
Etela Rajender Grand Victory in Huzurabad టీఆర్ఎస్ నుండి బయటికి వచ్చి గెలిచిన ఈటెల
Advertisement
Ads by CJ

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో టీఆరెస్ పార్టీకి ఎదురు లేకుండా పోయింది. కాంగ్రెస్ కానీ, బిజెపి కానీ వేళ్ళ మీద లెక్కబెట్టే సీట్లకే తెలంగాణలో తమ ప్రతాపం చూపుతూ ఉనికిని చాటుతున్నాయి. ఇక ఏప్రిల్ లో కేసీఆర్ కుడి భుజం ఈటెల రాజేంద్రకి టీఆరెస్ పార్టీ స్పాట్ పెట్టి.. ఆరోపణలతో టీఆరెస్ పార్టీ నుండి గెంటేసింది. అయితే ఆరోపణలు ఎదుర్కున్న ఈటెల రాజేంద్ర కాంగ్రెస్ లో చేరతారనుకుంటే.. టీఆరెస్ బద్ద శత్రువు బీజేపీలో చేరి.. ఎన్నికలకు సిద్దమయ్యారు. హుజురాబాద్ నుండి ఈటెల బిజెపి తరపున పోటీ చేసారు. ఇక బిజెపిపై ఈటెలపై గెలిచేందుకు కేసీఆర్.. హుజురాబాద్ ఓటర్లు కి భారీగా పథకాలు ప్రవేశపెట్టారు. అందులో భాగంగా దళిత బందు ఈ ఎన్నికల్లో టీఆరెస్ కి పనికొస్తుంది అనుకున్నారు కానీ... ఈటెల వ్యూహం ముందు కేసీఆర్ పథకాలు ఫలించలేదు.

హరీష్ రావు ఇంచార్జ్ గా హుజురాబాద్ ఎన్నికల్లో టీఆరెస్ తరపున పోటీ చేసిన టీఆర్ఎస్ నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్ పై ఈటెల రాజేంద్ర బిజెపి నుండి పోటీపడి 23,865 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. టీఆరెస్ తరపున హరీష్ రావు, గంగుల, కొప్పుల, బాల్క సుమ లాంటి హేమాహేమీలు ప్రచారం చేసినా టీఆరెస్ ఓడిపోయింది. ఇక ఈ ఎలక్షన్ కౌంటింగ్ లో మొదట టీఆరెస్ హవా చూపించినా.. 11 రౌండ్ ల తర్వాత బిజెపి ఆధిక్యంలోకి వచ్చి.. ఈటెల కి గెలుపుని విజయాన్ని అందించింది. ఇక హుజురాబాద్ నుండి ఈటెల ఈ గెలుపుతో ఏడుసార్లు గెలుపొందడం ఆయన రాజకీయ జీవితానికి నిదర్శనంగా చెబుతున్నారు. 

Etela Rajender Grand Victory in Huzurabad:

Etela Rajender Huge Victory In Huzurabad By Polls

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ