Advertisementt

భారీగా డిమాండ్ చేస్తున్న హీరోయిన్

Tue 02nd Nov 2021 08:34 PM
tamannah,tamanna takes 3 cr remuneration,chiru,meher ramesh,chiranjeevi,bhola shankar movie  భారీగా డిమాండ్ చేస్తున్న హీరోయిన్
Tamannah takes 3 cr remuneration for this movie భారీగా డిమాండ్ చేస్తున్న హీరోయిన్
Advertisement
Ads by CJ

ఈ ఏడాది సీటిమార్, మ్యాస్ట్రో మూవీస్ లో గ్లామర్ గా హిట్ కొట్టేసింది తమన్నా. సీటిమార్ లో హీరోయిన్ గాను, మ్యాస్ట్రో లో నెగెటివ్ రోల్ లో అందాలు ఆరబోస్తూ రెచ్చిపోయిన తమన్నా ఐటెం సాంగ్స్ ని వదలడం లేదు. సమంత, కాజల్ లాంటి హీరోయిన్స్ కి పోటీ ఇస్తున్న తమన్నా.. పారితోషకం విషయంలోనూ తగ్గడం లేదు. తాజాగా మాస్టర్ చెఫ్ ఈవెంట్ నిర్వాహకులతో పారితోషకం విషయంలో పేచీ పడిన తమన్నా ఇప్పుడు చిరు తో కలిసి నటించేందుకు భారీగా డిమాండ్ చేసింది అనే టాక్ నడుస్తుంది. మెహెర్ రమేష్ - చిరు కాంబోలో తెరకెక్కనున్న తమిళ వేదాళం రీమేక్ భోళా శంకర్ రేపు 11 న మొదలు కాబోతుంది.

15 నుండి రెగ్యులర్ షూట్ కి వెళ్ళనున్న ఈ సినిమాలో హీరోయిన్ గా తమన్నా ఎంపిక దాదాపుగా ఖాయమైనట్టుగా చెబుతున్నారు. ఈ సినిమాలో చిరు చెల్లెలి పాత్ర చేస్తున్న కీర్తి సురేష్ ని ఇష్టపడే అబ్బాయికి అక్క పాత్రలో తమన్నా కనిపించబోతుంది. అయితే ఈ సినిమాలో చిరు సరసన హీరోయిన్ గా చేస్తున్నందుకు గాను.. తమన్నా భారీగా డిమాండ్ చేసింది అని.. మేకర్స్ కూడా తమన్నా గ్లామర్ సినిమాకి అవసరం అని ఆమె అడిగింది కాదనడం లేదని టాక్. అయితే తమన్నా భోళా శంకర్ కోసం ఏకంగా 3 కోట్ల పారితోషకం అందుకోబోతుంది అని అంటున్నారు. ఇప్పటికే ఆ మూడు కోట్లలో సగం అడ్వాన్స్ రూపంలో అందుకుంది అని కూడా ఫిలిం నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 

Tamannah takes 3 cr remuneration for this movie:

Tamanna takes 3 cr remuneration for Bhola Shankar

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ