కన్నడ టాప్ హీరో.. పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణంతో అభిమానులే కాదు.. శాండిల్ వుడ్ ప్రముఖులతో పాటుగా టాలీవుడ్ ప్రముఖులు షాక్ కి గురయ్యారు. పునీత్ రాజ్ కుమార్ మరణంతో దిగ్బ్రాంతికి గురైన టాలీవుడ్ ప్రముఖులు చాలామంది బెంగుళూరు వెళ్లి పునీత్ రాజ్ కుమార్ భౌతిక కాయం వద్ద కన్నీటి పర్యంతమయ్యారు. కన్నీళ్లతో పునీత్ భౌతిక కాయానికి నివాళులర్పించారు. బాలకృష్ణ, యంగ్ టైగర్ ఎన్టీఆర్, రానా, చిరంజీవి, వెంకటేష్.. ఇలా చిన్న పెద్ద హీరోలు, టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులు బెంగుళూరు వెళ్లి పునీత్ కి కడసారి వీడ్కోలు పలికారు. ఏమాయె చెయ్యకపోతే పునీత్ కోసం అంతమంది తెలుగు హీరోలు వెళ్లడం మాములు విషయం కాదు. అందరిలో మంచిగా ఉండడం, స్నేహం గా ఉండడమే పునీత్ మరణం తర్వాత తన దగ్గరకు అంతమందిని రప్పించుకున్నాడు.
ఇక పునీత్ అంత్యక్రియలు ఆదివారం కంఠీరవ స్టేడియం లో తల్లితండ్రుల సమాధుల వద్ద ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. పెద్ద ఎత్తున సినీ, రాజకీయ ప్రముఖులు, కర్ణాటక సీఎం తో పాటుగా.. భారీగా అభిమానులు హాజరై ఆయనకి వీడ్కోలు పలికారు.
అయితే తాజాగా టాలీవుడ్ నుండి అక్కినేని నాగార్జున పునీత్ రాజ్ కుమార్ ఇంటికి వెళ్లి పునీత్ ఫామిలీ మెంబెర్స్ ని పరామర్శించారు. నాగార్జునకి వేరే పనుల్లతో బిజీగా ఉండడం వలన.. ఆయన పునీత్ కడసారి చూపుకోసం వెళ్లలేకపోవడంతో.. ఈ రోజు నాగార్జున బెంగుళూరులోని పునీత్ రాజ్ కుమార్ ఇంటికి వెళ్లి అయన కుటుంబ సబ్యులని పరామర్శించారు. అందుకే పునీత్ రాజ్ కుమార్ ఏం మాయో చెయ్యకపోతే ఇంతమంది టాలీవుడ్ నుండి ఆయన్ని చూడడానికి వెళ్ళరు. స్నేహానికి మరో రూపమే పునీత్ రాజ్ కుమార్.. అలాగే సేవకి మరో పేరు.. ఆ మంచి తనమే అయన చనిపోతే కోకోల్లలుగా ఆయన వద్దకు వెళ్లేలా చేసింది.