అడివి శేష్ హీరోగా రాబోతోన్న మేజర్ సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. దీపావళికి ముందు రోజు ఇలా అప్డేట్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు మేకర్స్. ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోను విడుదల చేస్తూ.. రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
మూడు భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం మొత్తంగా 120 రోజుల పాటు షూటింగ్ జరుపుకుంది. 75 లొకేషన్లలో షూటింగ్ చేయగా.. ఎనిమిది సెట్లు ప్రత్యేకంగా నిర్మించారు. ఈ వీడియోలో అతని జర్ని, ప్రేమ అన్నీ చూపించారు. టీనేజ్ కుర్రాడి నుంచి ధైర్యసాహసాలు కలిగిన సైనికుడిగా మారిన జర్నీని చూపించారు. ఇప్పటి వరకు ఈ చిత్రంను విడుదల చేసిన ప్రతీ అప్డేట్ అంచనాలను మరింత పెంచింది. ఇప్పుడు ఈ వీడియోతో అందరి దృష్టిని ఆకర్షించారు.
మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను తెరెక్కిస్తున్నారు. 26/11 దాడుల్లో ఆయన చూపించిన తెగువ, ధైర్య సాహసాలు మాత్రమే కాకుండా ఆయన జీవితంలోని ప్రతీ ఒక్క ఘటనను చూపించబోతోన్నారు. ఆయన ఏ స్ఫూర్తితో జీవించారు.. ఎలా మరణించారు అనేవి అందరినీ కట్టిపడేసేలా చూపించనున్నారు.
ఇది వరకు విడుదల చేసిన టీజర్‌లో మేజర్ ఉన్ని కృష్ణన్ బాల్యాన్ని చూపించారు. టీనేజ్ నుంచి ఆర్మీ ఆఫీసర్‌గా ఎదిగిన క్రమాన్ని చూపించారు. వార్ డ్రామాతో రాబోతోన్న ఈ సినిమా మీద టీజర్ అంచనాలు పెంచేసింది.
శశి కిరణ్ తిక్కా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అడివి శేష్, శోబితా ధూళిపాళ్ల, సాయీ మంజ్రేకర్ నటిస్తున్నారు. హిందీ, తెలుగు, మళయాల భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది.