Advertisementt

పవన్ దివాళి విషెస్.. రానా ఒంట్లో టెంక్షన్

Wed 03rd Nov 2021 07:37 PM
pawan kalyan,rana,sagar k chandra,lala bheemla video promo,bheemla nayak movie,deepavali special  పవన్ దివాళి విషెస్.. రానా ఒంట్లో టెంక్షన్
Pawan Kalyan Lala Bheemla video promo of Bheemla Nayak పవన్ దివాళి విషెస్.. రానా ఒంట్లో టెంక్షన్
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో సాగర్ కే చంద్ర దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం భీమ్లా నాయక్. స్క్రీన్ ప్లే- సంభాషణలు సుప్రసిద్ధ దర్శకుడు, రచయిత త్రివిక్రమ్ అందిస్తున్నారు. ఈ సినిమాపై పవన్ ఫాన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉంది.. భీమ్లా నాయక్ నుండి విడుదలవుతున్న పోస్టర్స్, ప్రోమోస్, సాంగ్స్ అన్ని.. ఫాన్స్ కే  కాదు.. అందరికి అంటే మాస్ ప్రేక్షకులకి బాగా నచ్చుతున్నాయి. 

ఇక భీమ్లా నాయక్ నుంచి మరో సాంగ్ విడుదలకానుంది. దీనికి సంభందించి ఓ ప్రచార చిత్రాన్ని, డైలాగ్ తో కూడిన వీడియోను విడుదల చేసింది. 

ప్రోమోలో పవన్ కళ్యాణ్ మాస్ గా కాదు.. ఊర మాస్ గా మరో హీరో హీరో రానా కి చమటలు పట్టించారు. భీమ్లా నాయక్ గా పవన్ కళ్యాణ్.. డ్యానియల్ శేఖర్ రానా ఒంట్లో వణుకు పుట్టించే డైలాగ్, కార్ బ్లాస్ట్ అన్ని అదిరిపోయాయి.. ప్రోమోలోకి వెళితే.. 

నాగరాజు గారు.. హార్టీ కంగ్రాట్స్ లేషన్స్ అండి, మీకు దీపావళి పండుగ ముందుగానే వచ్చేసింది.. హ్యాపీ దీపావళి అంటూ చేతిలో ఉనన్ బాంబు చూపిస్తారు. పవన్ కళ్యాణ్ ఆ డైలాగ్ రానాని ఉద్దేశించి అనటం కనిపిస్తుంది. ఈ ప్రోమోలో పవన్ కార్ బ్లాస్ట్ చెయ్యగానే.. రానా ఒక్కసారిగా ఉలిక్కి పడడం ఓ చిన్న షాట్ లో కనిపించింది. ప్రోమో చివరిలో లాలా భీమ్లా పాట నవంబర్ 7 న విడుదల అన్న ప్రకటన కూడా కనిపిస్తుంది.  . 

Pawan Kalyan Lala Bheemla video promo of Bheemla Nayak:

Pawan Kalyan is swag-personified in the Lala Bheemla video promo of Bheemla Nayak, wishes Deepavali a day earlier 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ